దుంప తెగ! | sakshi food spcial | Sakshi
Sakshi News home page

దుంప తెగ!

Published Fri, Jul 15 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

దుంప తెగ!

దుంప తెగ!

తప్పు చేస్తే తాతయ్యో నానమ్మో
విపరీతమైన కోపం వచ్చి...
సున్నితంగా తిట్టే తిట్టు... ‘వాడి దుంప తెగ
అంతపని చేశాడా..’ అని.
తిట్టులో కూడా ప్రేమను దట్టిస్తారు!
అలా... రుచిని దట్టించి
రోజూ తినే కూరల బోర్‌డమ్‌ని
తెగ్గొట్టండి.
దుంపలతో ప్రేమను వడ్డించండి.
‘దుంప తెగ... ఏం టేస్టు...’
అనే కాంప్లిమెంటు కొట్టేయండి.

 
క్రీమ్ చీజ్ ఫిల్డ్ బీట్స్
 
కావల్సినవి: బీట్ రూట్స్ - 2
ఫిల్లింగ్ కోసం: చిలికిన పెరుగు - 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ చీజ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగిన క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగి కొత్తిమీర - టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్  సాస్ కోసం: నూనె - టీ స్పూన్  రెడ్ క్యాప్సికమ్ - 2; గ్రీన్ క్యాప్సికమ్ - 2 వెల్లుల్లి -2 రెబ్బలు; జీలకర్ర - 2 టీ స్పూన్ ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూన్  కొత్తిమీర - టీ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్
 
తయారి:  పీలర్‌తో బీట్‌రూట్ పై తొక్క తీసి, ఉడకబెట్టి, చాలా పలచని స్లైసులుగా కట్ చేయాలి.  ఫిల్లింగ్‌కి ఇచ్చినవన్నీ గిన్నెలో వేసి కలపాలి. పలచని బీట్‌రూట్ స్లైసులను రోల్ చేసి, పై మిక్చర్(ఫిల్లింగ్)ని ఫిల్ చేయాలి. సాస్ కోసం ఇచ్చిన పదార్థాలలో రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా వేపి, చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. అలాగే పచ్చ క్యాప్సికమ్, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర విడిగా వేయించి చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. ఫిల్ చేసిన బీట్‌రూట్ రోల్స్‌ని ప్లేట్‌లో పెట్టి ఒకవైపు ఎరుపు రంగు క్యాప్సికమ్ మిశ్రమం, మరోవైపు పచ్చరంగు క్యాప్సికమ్ మిశ్రమం పోయాలి. {Mీమ్ చీజ్.. ఆ పైన కొత్తిమీర లేదా తులసి ఆకును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 
కుక్డ్ కెబాబ్
కావల్సినవి: బంగాళదుంపలు-3 లేదా చామదుంపలు - 6; ఉప్పు - తగినంత; నల్లుప్పు - అర టీ స్పూన్; కొత్తిమీర - టీ స్పూన్; చాట్ మసాలా - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2; బ్రెడ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు (శనగపిండి కూడా వాడుకోవచ్చు)
 
ఫిల్లింగ్ కోసం: అల్లం తరుగు - టీ స్పూన్ బాదంపప్పు తరుగు - టీ స్పూన్ పచ్చి బఠాణీలు -2 టేబుల్ స్పూన్లు   చీజ్ - టీ స్పూన్; కిస్‌మిస్ - టీ స్పూన  నీళ్లన్నీ వడకట్టిన గడ్డ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ:      దుంపలను ఉడికించి, పై పొట్టు తీసి గుజ్జు చేయాలి. అందులో ఉప్పు, నల్లుప్పు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చాట్‌మసాలా, బ్రెడ్ పొడి, తరిగిన పచ్చిమిర్చి, మిగిలిన ఇతర దినుసులు కూడా వేసి బాగా కలపాలి. ముద్దగా తయారైన ఈ మిశ్రమాన్ని సమభాగాలుగా తీసుకొని, ఉండలు చేసి, అరచేత్తో అదమాలి. కడాయిలో తగినంత నూనె పోసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి.. రెండువైపులా వేయించాలి.  టూత్ పిక్‌లకు ఈ కెబాబ్స్‌ను గుచ్చి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అలంకరణకు ఉల్లిపాయ, క్యారెట్, బీట్‌రూట్ తరుగు, కొత్తిమీర వాడచ్చు.
 
స్వీట్ పొటాటో చీజ్ కేక్
కావాల్సినవి: స్వీట్‌పొటాటో (చిలగడ దుంప) - 1 (100 గ్రా.), కుకీ క్రంబ్స్ - కప్పు; తాజా పాల మీగడ (చిలికినది) - పావు లీటర్, క్రీమ్ చీజ్ - 200 గ్రాములు; గుడ్లు - 3; పంచదార పొడి - 200 గ్రాములు, మొక్కజొన్న పిండి - 125 గ్రాములు

తయారీ:      చిలగడ దుంపలను ఉడికించి గుజ్జు చేయాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రంగా జామూన్లను తయారుచేయాలి. ఇందుకు కార్న్‌ఫ్లోర్‌ను వాడుకోవచ్చు. వీటిని నూనెలో అన్ని వైపులా వేయించి, పంచదార పాకంలో వేసి ఉంచాలి.
  వెడల్పాటి పుడింగ్ కేక్ గిన్నెకు అడుగున నెయ్యి రాయాలి. పైన కుకీ క్రంబ్స్ పొడి వేసి ఆ పైన చిలగడదుంప జామూన్లు వేయాలి.
  ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ, పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పుడింగ్ గిన్నెలో పోయాలి.
 
ఈ గిన్నెను ఇడ్లీ కుకర్‌లో పెట్టి సన్నని మంట మీద ఆవిరితో ఉడికించాలి. పూర్తిగా ఉడికాక దించుకోవాలి. చల్లారాక తీసి, చాకొలెట్ చాప్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.   అవెన్‌లో అయితే 160 నుంచి 180 డిగ్రీల ఉష్ణొగ్రతలో అరగంటపాటు బేక్ చేయాలి.
 
స్టఫ్డ్ శాండ్‌విచ్
కావల్సినవి: బంగాళదుంప/క్యారెట్ - 3, ఉల్లిపాయలు - 2, టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 1 రెమ్మ, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్
 తయారీ:  బంగాళదుంప లేదా క్యారెట్ తొక్క తీసి, ఉడికించి, గుజ్జు చేయాలి.
  మూకుడులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కలపాలి.
దీంట్లో దుంప గుజ్జు వేసి కలపాలి.  మిశ్రమం బాగా వేగాక  కాల్చిన శాండ్‌విచ్ బ్రెడ్ మధ్యలో అమర్చాలి. ఫ్రెంచ్ ప్రైస్ లేదా చిప్స్‌తో సర్వ్ చేయాలి.
 
ఖజానా ఆలూ
కావాల్సినవి బంగాళదుంపలు/చిలగడ దుంపలు - 4 ఫిల్లింగ్ కోసం: బాదంపప్పు తరుగు - టీ స్పూన్  జీడిపప్పు తరుగు - టీ స్పూన్  పిస్తాపప్పు తరుగు - టీ స్పూన్  పచ్చిమిర్చి - 2; చీజ్ - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు సాస్ కోసం: టొమాటో గుజ్జు  200 గ్రాములు సాజీర - అర టీ స్పూన్; యాలకులు - 4  బిర్యానీ ఆకు - 1; కారం - టీ ఊ్పన్  మెంతిపొడి - అర టీ స్పూన్; కొతితమీర - కట్ట  నూనె - టీ స్పూన్; ఉప్పు - తగినంత  పాల మీగడ - టేబుల్ స్పూన్ నెయ్యి - టీ స్పూన్; వెన్న - టేబుల్ స్పూన్
 
తయారీ బంగాళదుంప తొక్క తీసి మధ్యభాగాన్ని కొంత తీసి, ఉడికించాలి.   డ్రై ఫ్రూట్స్, ఛీజ్, పచ్చిమిర్చి, బంగాళుదంప గుజ్జు, ఉప్పు.. దుంప మధ్యన కూరాలి.  కార్న్‌ఫ్లోరోలో అన్నివైపులా దొర్లించి కాగుతున్న నూనెలో వేసి, వేయించి తీయాలి. మందపాటి గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి.  మరొక కడాయిలో నూనె వేసి సాజీర, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, మెంతిపిండి, టొమాటో గుజ్జు, ఉప్పు, పంచదార వేసి ఉడికించాలి. మిశ్రమం నుంచి నూనె వేరయ్యాక కొద్దిగా నూనె కలిపి పాల మీగడ, నెయ్యి, వెన్న వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బంగాళదుంప ముక్కలున్న గిన్నెలో ముక్కలు తడిసేలా పోయాలి. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కొత్తిమీరతో అలంకరించాలి.
 
ముల్లంగి పచ్చడి
కావల్సినవి: ముల్లంగి - 1 (తరుమాలి) ఎండుమిర్చి - 2; ధనియాలు - 2 టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; మెంతులు - పావు టీ స్పూన్ కరివేపాకు - 1 రెమ్మ; నూనె - టేబుల్ స్పూన్ మినప్పప్పు - శనగపప్పు - టీ స్పూన్  చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు  ఉప్పు - తగినంత
 
తయారి: కడాయి పొయ్యి మీద పెట్టి టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేసి వేయించి, తీసి పక్కనుంచాలి. అదే కడాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు ఉడికించి, దించాలి. ముందుగా వేయించుకున్న దినుసులన్నీ చల్లారాక తగినంత ఉప్పుతో సహా కలిపి పొడి చేయాలి. దీంట్లో చింతపండు గుజ్జు, ఉడికిన ముల్లంగి వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. దీనిని గిన్నెలోకి తీసుకోవాలి.   కడాయిలో మిగిలిన నూనె పోసి జీలకర్ర, పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. దీనిని పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement