పాండీ బాండీ | pandy bandi | Sakshi
Sakshi News home page

పాండీ బాండీ

Published Sat, May 14 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

pandy bandi

ఫుడ్‌లో పాండిచ్చేరికి ఓ స్టెయిల్ ఉంది! అక్కడి వంటగిన్నెల మూత తెరవగానే.. ఫ్రాన్స్ దేశపు ఘుమఘుమలు వలసవచ్చినట్లుగా ఉంటుంది! పాండీ బాండీ.. ప్రాచీనమైనది. అందులో వండేవన్నీ ఏ రుచికీ మ్యాచ్ కానివి. ఇన్‌టాంజిబుల్! అనిర్వచనీయం!! అతిథులు సర్టిఫికెట్ ఇవ్వడం మామూలే. ఐక్యరాజ్యసమితి కూడా ఇచ్చిందంటే మాటలా! టేస్ట్ చెయ్యండి. జీవితాన్ని వేస్ట్ చెయ్యకండి.
 
పాండిచ్చేరి వెజ్ కర్రీ

కావల్సినవి:
పచ్చికొబ్బరి తురుము - కప్పు
 వెల్లుల్లి - 3-4 రెబ్బలు (సన్నగా తరగాలి)
 ఎండుమిర్చి - 5-6
 ధనియాలు - 2 టీ స్పూన్లు
 జీలకర్ర - టీ స్పూన్
 మిరియాలు - 8-10
 చింతపండు గుజ్జు - టీ స్పూన్
 ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
 పసుపు - అర టీ స్పూన్
 నీళ్లు - ముప్పావు కప్పు
 (పైవన్నీ వేయించి, మెత్తగా గ్రైండ్ చేసి, పక్కనుంచాలి)
 కూరగాయల ముక్కలు (బేబీకార్న్ - 9, క్యారెట్ - 1, మష్రూమ్స్ - 10, బీన్స్ - 9-10, బంగాళాదుంప - 1; నచ్చిన కూరగాయల ముక్కలను వేసుకోవచ్చు) - ఇవన్నీ కలిపి 3 కప్పులు,
 ఉల్లి తరుగు - పావు కప్పు
 పచ్చిమిర్చి - 2 (నిలువుగా కట్ చేయాలి)
 నీళ్లు - 3 కప్పులు; కొబ్బరి నూనె లేదా వంటనూనె - 2 టేబుల్ స్పూన్లు
 ఉప్పు - తగినంత
 
తయారీ:
* కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలను వేయించాలి.
* దీంట్లో కూరగాయల ముక్కలు వేసి 6 నుంచి7 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
* ముందు సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసి, కలిపి, ఉడకనివ్వాలి.
* తగినన్ని నీళ్లు కలిపి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
* 20- నుంచి 30 నిమిషాల సేపు సన్నని మంట పై మిశ్రమాన్ని ఉడికించాలి. నీళ్లు తక్కువైతే మరికాస్త కలుపుకోవచ్చు.
* చివరగా కొత్తిమీర చల్లి, దించాలి. అన్నంతో పాటు వేడి వేడిగా ఈ కర్రీని వడ్డించాలి.
 
పాండిచ్చేరి చికెన్ కర్రీ
కావల్సినవి: ఉల్లిపాయలు - 3 (తరగాలి)
 టొమాటోలు (పెద్దవి) - 2
 జీలకర్ర - టీ స్పూన్
 దాల్చిన చెక్క - చిన్న ముక్క
 లవంగాలు - 2; సోంపు - టీ స్పూన్
 అల్లం - చిన్న ముక్క; వెల్లుల్లి - 6 రెబ్బలు
 ఎండుమిర్చి - 6; యాలకులు - 2
 నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
 (కడాయిలో నూనె వేసి పై దినుసులు,
 పదార్థాలు వేసి, వేయించి, చల్లారాక ముద్దగా నూరి పక్కన పెట్టుకోవాలి)
 చికెన్ లేదా మటన్ - అర కేజీ
 అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్
 ఉప్పు - రుచికి తగినంత;
 నూనె - 2 టేబుల్ స్పూన్లు; (చికెన్ లేదా మటన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, కొద్దిగా నీళ్లు కలిపి ఉడికించాలి)
 నూనె - 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు - 1
 సోంపు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ
 ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ:
* కడాయిలో నూనె వేసి వేడయ్యాక కరివేపాకు, సోంపు, బిర్యానీ ఆకు వేయించాలి.
* సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసి కలపాలి.
* దీంట్లో ఉడికించిన చికెన్ లేదా మటన్ వేసి కలపాలి. సన్నని మంట మీద ముక్క పూర్తిగా ఉడికాక, ధనియాల పొడి వేసి కలిపి, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని, కొత్తిమీర చల్లి దించాలి.
 
బనానా బాంకర్స్
కావల్సినవి: అరటిపండ్లు - 3
 ఐస్ (చితగ్గొట్టినది)- కప్పు
 నిమ్మరసం - టీ స్పూన్
 తాజా ద్రాక్షరసం - 3 కప్పులు
 
తయారీ:

* అరటిపండును గుజ్జు చేయాలి. అరటిపండు గుజ్జు, ద్రాక్ష రసం, 2 కప్పుల నీళ్లలో కలిపిన నిమ్మరసం, క్రష్డ్ ఐస్.. ఒకదాని మీద ఒకటి వేసి చల్లగా అందించాలి.
 
క్రీప్స్
కావల్సినవి: గుడ్డు - 1
 ఉప్పు లేని బటర్ - 30 గ్రా., మైదా - 150 గ్రా.; పాలు - 2 కప్పులు, స్ట్రాబెర్రీలు- 4, అరటిపండు-1
 
తయారీ:
* మందపాటి గిన్నెలో బటర్ కరిగించి, కొద్దిగా చల్లారనివ్వాలి.
* మరో గిన్నెలో మైదా, పాలు, గుడ్డు సొన వేసి బాగా బ్లెండ్ చేయాలి.
* క్రీప్స్ పాన్ లేదా అంచులున్న వెడల్పాటి పాన్ పైన మూత ఉండేది తీసుకోవాలి. పాన్‌ను వేడి చేసి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల పై మిశ్రమాన్ని వేసి, దోసెలా గరిటెతో వెడల్పు చేయాలి. పైన మూత పెట్టి, ఆ తర్వాత తిప్పి రెండు వైపులా కాల్చాలి. (పెసరట్టులా) నాన్‌స్టిక్ పాన్ అయితే నూనె అవసరం పడదు.
* ఇలా తయారుచేసుకున్న క్రీప్స్ లోపల స్ట్రాబెర్రీ, అరటిపండు ముక్కలు సెట్ చేసి, పైన కరిగించిన బటర్ వేసి రోల్ చేయాలి. ఆ పైన చాక్లెట్ క్రీమ్‌తో అలంకరించి, చిటికెడు పంచదార పొడి చల్లి సర్వ్ చేయాలి.
 
చనా డోస్కావల్సినవి: శనగపప్పు - అర కేజీ
 పంచదార - కేజీ; ఎండు కొబ్బరి తురుము- 4 కప్పులు; నెయ్యి - 200 గ్రా.లు
 
తయారీ

* శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
* తురిమిన కొబ్బరి, పంచదార ఉడికిన శనగపప్పులో వేసి కలపాలి.
* శనగపిండిలో పంచదార, కొబ్బరి బాగా కలిసేంతవరకు గరిటెతో తిప్పాలి.
* దీంట్లో 150 గ్రాముల నెయ్యి వేసి మళ్లీ కలపాలి.
* వెడల్పాటి బేసిన్‌కు మిగతా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో పోసి చదునుగా చేయాలి.
* 10 నిమిషాల తర్వాత స్క్వేర్ షేప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సర్వ్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement