పొట్లకాయ... సన్నగా లేతగా నాజూగ్గా ఉంటుంది దాంతో వంట గదిలో ఏ మ్యాజిక్ అయినా చేయచ్చు రుచి కూడా అంతే! రుచిలో పొట్లకాయతో పోట్లాడే కూరగాయ లేదేమో దీనిని వండితే ఇంట్లో పోట్లాటలు తప్పవేమో వండండి... పోటీ పడి తినండి
పొట్లకాయ దోశె
కావలసినవి: చిన్న సైజు పొట్లకాయ – 1, బియ్యప్పిండి – 1/4 కప్పు, బొంబాయి రవ్వ – 1 స్పూన్ (ఆప్షనల్), జీలకర్ర – 1/4 టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ – 1 (ఆప్షనల్), కొత్తిమీర – కొంచెం, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – సరిపడ.
తయారీ: ∙పొట్లకాయను కడిగి, గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙ఒక జార్‌లో పొట్లకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి సరిపడ నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, సరిపడ ఉప్పు, తరిగిన కొత్తిమీర, పొట్లకాయ పేస్ట్ అన్నీ కలిపి సరిపడ నీరు పోసి దోశె పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి అర స్పూన్ నూనె వేసి వేడయ్యాక గుండ్రంగా దోశె వేసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ∙దోశెకు చిల్లులు పడి కాలిన తర్వాత కొంచెం నూనె వేసి రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
పొట్లకాయ పెరుగు పచ్చడి
కావలసినవి: పొట్లకాయ ముక్కలు – 1 కప్పు, పెరుగు – 1/2 లీటరు, ఎండుమిర్చి – 2, పోపు దినుసులు – అర టీ స్పూన్, తరిగిన మిర్చి – 3, ఉప్పు – రుచికి సరిపడ, కారం – 1/2 టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1; కరివేపాకు – 2 రెబ్బలు, ఇంగువ – చిటికెడు, మెంతిపొడి– 1/2 టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
తయారి: ఒక గిన్నెలో పెరుగు తీసుకుని గిలకొట్టి, సరిపడ ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి ∙వేగిన పోపులో ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, మెంతిపొడి వేసి నిమిషం వేగనిచ్చి, పొట్లకాయ ముక్కలు వేసి మరో పది నిమిషాలు వేయించుకోవాలి ∙పొట్లకాయ ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు గిన్నెలోకి ఈ పొట్లకాయ ముక్కలను, జీలకర్ర పొడిన వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ!
పొట్లకాయ బజ్జీ
కావలసినవి: పొట్లకాయ – 1, శనగపిండి – 2 కప్పులు, బియ్యప్పిండి – 1/4 కప్పు, వాము – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు; కారం – 1/2 టీ స్పూన్, వంట సోడా – 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – వేయించడానికి సరిపడ, చాట్ మసాలా – 1 టీ స్పూన్ (ఆప్షనల్).
తయారీ: ∙పొట్లకాయను స్పూన్‌తో పై పొట్టును తీసుకోవాలి ∙పొట్లకాయను మనకు కావలసిన షేప్‌లో అంటే రింగ్స్‌లా కానీ, పొడవుగా కానీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పొట్లకాయ ముక్కలు, నూనె తప్ప మిగిలినవన్నీ కలిపి కొంచెం కొంచెం నీరు పోస్తూ మరీ జారుగా కాకుండా పిండి కలుపుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి బాగా వేడయ్యాక మీడియమ్ మంటమీద పొట్లకాయ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పొట్లకాయ బజ్జీలను నూనె లేకుండా ప్లేట్‌లోకి తీసుకుని లైట్‌గా చాట్ మసాలా చల్లి వేడి వేడిగా సర్వ్ చేయండి.
గుత్తి పొట్లకాయ
కావలసినవి: పొట్లకాయ – 1 (అంగుళంన్నర ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు, ఉల్లిపాయ – 1, అల్లం – 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి – 10 రెబ్బలు, జీలకర్ర – 1 టీ స్పూన్, ధనియాలు – 1 టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, చీజ్ – 4 టీ స్పూన్స్, పసుపు – కొంచెం, మిర్చి – 1/4 టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1/2 టీ స్పూన్ (లేదా ఆమ్‌చూర్ పౌడర్ – 1 టీ స్పూన్), ఉప్పు – రుచికి సరిపడ, నూనె 4 టీ స్పూన్.
తయారీ: ∙పొట్లకాయ పైపొట్టును స్పూన్‌తో తీసి కడగాలి. స్టవ్ చేసుకోవడానికి వీలుగా మధ్యలో ఉన్న గింజలు కూడా తీసేయాలి ∙మిక్సీ జార్‌లో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి 2 స్ఫూన్లు నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి ∙తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద, పొట్లకాయను గింజలు, చింతపండు గుజ్జు, గరం మసాలా, ఛీజ్ కూడా వేసి మరి కాసేపు వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన స్టఫింగ్‌ను పొట్లకాయ ముక్కలలో కూరుకోవాలి మరొక బాణలిని వేడి చేసి 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేగనివ్వాలి ∙చిన్న మంట మీద 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత నెమ్మదిగా అన్ని వైపులా కాలేలా స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙పూర్తిగా వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గుత్తి పొట్లకాయ రెడీ!
– సేకరణ: జ్యోతి గొడవర్తి
Comments
Please login to add a commentAdd a comment