విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు అందజేసిన అధికారులు, సంస్థ ప్రతినిధులు
-
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ హమీద్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం కోసం శ్రమించాలని, కష్టపడి చదివిన వారికి భవిష్యత్ ఉంటుందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ హమీద్ అన్నారు. జమియతే ఇస్లామీ హింద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక యూనిక్ గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో నిరుపేద విద్యార్థులు, అనాథలకు ఉచితంగా స్కూల్ బ్యాగ్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హమీద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మైనార్టీల్లో విద్యశాతాన్ని పెంచడానికి కార్పొరేట్ తరహాలో విద్యను అందించడానికి రాష్ట్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎనిమిది గురుకులాలు నడుస్తున్నాయని, ఇక్కడ విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జేఐహెచ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్‌లను అందజేశారు. కార్యక్రమంలో నారాయణపేట డిప్యూటీ ఈఓ బీవీ సుబ్రమణ్యం, జేఐహెచ్ పట్టణశాఖ అధ్యక్షుడు సుజాత్ అలీ, కార్యదర్శులు డాక్టర్ ఖాలెక్, షర్పోద్దీన్, ఇస్మాయిల్, హసన్, ముజాహిద్, అబ్రార్, ఖాలెద్, ఎస్‌ఐఓ జిల్లా, పట్టణ అ«ధ్యక్షుడు అయూబ్, వాజిద్, ముస్తాక్ పాల్గొన్నారు.