సింగరేణి సిగలో ‘బయ్యారం’ | Sigalo production in 'Bayyina' | Sakshi
Sakshi News home page

సింగరేణి సిగలో ‘బయ్యారం’

Published Fri, Apr 3 2015 2:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

సింగరేణి సిగలో ‘బయ్యారం’ - Sakshi

సింగరేణి సిగలో ‘బయ్యారం’

  • ఐరన్ ఓర్ వెలికితీతకు శ్రీకారం
  • 2014-15లో 100 % బొగ్గు ఉత్పత్తి
  • రూ.14083 కోట్ల ఆదాయం
  • సెప్టెంబర్‌లోగా 5512 పోస్టులు భర్తీ
  • సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. బొగ్గు గనుల తవ్వకాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సింగరేణి  త్వరలో ఐరన్ ఓర్ అన్వేషణ రంగంలో ప్రవేశించనుంది. ఇప్పటివరకు తెలంగాణ భూభాగంలోనే గనుల తవ్వకాలు జరిపిన సంస్థ సమీప భవిష్యత్తులో తన కార్యకలాపాలను దేశ విదేశాలకు విస్తరింపజేయనుంది. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.

    2014-15 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన పురోగతితోపాటు భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఖమ్మం జిల్లా బయ్యారంలో ఐరన్ ఓర్ నిక్షేపాల అన్వేషణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయ్యారంలో నిక్షిప్తమై ఉన్న ఐరన్‌ఓర్ పరిమాణం, నాణ్యతపై 45 రోజుల్లో ప్రాథమిక అధ్యయనం జరపనున్నామని చెప్పారు. ఒడిషాలోని టాల్చేర్ వద్ద గల నైనీ బొగ్గుగనులను చేజిక్కించుకున్నామని, ఉత్కల్‌లోని బొగ్గు గను ల వేలంలో సైతం పాల్గొంటున్నామన్నారు.

    దక్షిణాఫ్రికా, ఇతర ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల్లో బొగ్గు గనుల తవ్వకాలకు ఆసక్తిని ప్రదర్శిస్తూ ఈ నెల రెండోవారంలో గ్లోబల్ ప్రకటనను జారీ చేస్తామన్నారు.  రాష్ట్రం లో సంస్థ 48 బ్లాకుల్లో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా.. మరో 14 కొత్త బ్లాకుల్లో తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎన్నడూలేని విధంగా 2014-15లో సింగరేణి మంచి ఫలి తాలు సాధించిందని శ్రీధర్ పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు 100 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని, గతేడాది బొగ్గు ఉత్పత్తిని 52 మిలి యన్ టన్నులకు పెంచామని, రానున్న నాలుగేళ్లలో 80 ఎం.టి.లకు తీసుకెళ్తామన్నారు.   
     
    సింగరేణికి గోల్డెన్ పీకాక్ పురస్కారం..

    గనుల తవ్వకాల్లో బయటపడిన మట్టితో నిర్మా ణ రంగ వస్తువులను తయారు చేసినందుకు సింగరేణిని గోల్డెన్ పీకాక్ ఎన్నోవేటివ్ ప్రాడక్ట్/సర్వీసు అవార్డు వరించింది. ఈ నెల 20న దుబాయ్‌లో యూఏఈ మంత్రి ముబారక్‌ల్ దీనిని ప్రదానం చేయనున్నారని తెలిపారు.
     
    సెప్టెంబర్‌లోగా 5 వేల ఉద్యోగాలు


    ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా సంస్థలో 5512 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో 2744 పోస్టులను సంస్థ ఉద్యోగుల సంబంధీకులకు, 539 పోస్టులను పదోన్నతుల ద్వారా, 2229 పోస్టులను బయటి వ్యక్తులకు కేటాయించామన్నారు. ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికామని, రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుపుతామన్నారు. కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement