యువత భవిష్యత్ ఓటుకు నోటు కేసుకు తాకట్టు
Published Sun, Nov 6 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
కొత్తపేట :
యువత భవిష్యత్‌ను పాలకులు ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టారని, దానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా కారకులని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించా రు. కొత్తపేటలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు స్వగృహంలో ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా నినాదం తో జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఒక్కరే పోరాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో అడిగినందుకు మాకు నోటీసులు ఇచ్చారన్నారు. ఫిరాయింపులపై తాము ఫిర్యాదు చేస్తే స్పీకర్ స్పందించడం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రత్యేక హోదాపై పోరాటం ఆపేది లేదని, మరింత ఉధృతం చేస్తామని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు.
టీడీపీ సంక్షేమానికి పెద్దపీట
టీడీపీ సంక్షేమం, ప్రభుత్వ నిధులు నేతల ఖాతాకు అనుసంధానం తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమతో నిధులు రుచి మరిగిన టీడీపీ నేతలు ఇప్పుడు పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని ఆరోపిం చారు. నిధులను సీఎం తనయుడు లోకేష్ ఖాతాకు అనుసంధానం చేస్తున్నారని విమర్శించారు. ప్రొటోకాల్ విషయంలో టీడీపీ నేతలు అధికార మధంతో వ్యవహరిస్తున్నా కేవలం శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళుతున్నామని జగ్గిరెడ్డి అన్నారు.
Advertisement
Advertisement