భవిష్యత్తులో భారత దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ఆవేదనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో
= భవిష్యత్తులో ఆహార కొరత తప్పదు
= సవాల్‌ను స్వీకరించేందుకు వ్యవసాయ
శాస్త్రవేత్తలు, విద్యార్థులు సిద్ధం కావాలి
= భారతరత్న డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు
సాక్షి, బెంగళూరు:భవిష్యత్తులో భారత దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ఆవేదనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సవాల్‌ను స్వీకరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు సన్నద్ధం కావాలని భారతరత్న డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు పిలుపునిచ్చారు. నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 49వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచే దిశగా యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయాన్నే ప్రధాన ఉపాధిగా ఎంచుకున్న భారత్‌లో సైతం ఆహార కొరత ఎందుకు ఏర్పడనుందనే దిశగా యువ వ్యవసాయ శాస్త్రవేత్తల ఆలోచనలు సాగాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల అంశంలో త్వరపడకపోతే రానున్న రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయంలో బయో, సైన్స్ అండ్ టెక్నాలజీల పూర్తి స్థాయి వినియోగం ద్వారా ఉత్పాదనలను పెంచేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మొత్తం 67 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ, 174 మందికి ఎమ్మెస్సీ, 574 మందికి డిగ్రీ, 79 మందికి డిప్లొమా పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ వాజు భాయ్ రుడాభాయ్ వాలా, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ హెచ్.శివణ్ణ తది తరులు పాల్గొన్నారు.