యాంత్రికత కాదు, సృజనాత్మకత కావాలి
నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థికవ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు.
ప్రతి ఉదయం లాగే ఈరోజు కూడా 6 గంటలకు ఉస్మాని యా ప్రాంగణం దగ్గర వాకిం గ్‌కి వెళ్లినపుడు ప్యాంట్లు, షర్టు లతో ఉన్న కొందరమ్మాయిలు చేతిలో ల్యాప్‌టాప్‌లతో పరిగె డుతూ కనిపించారు - బస్ కోసం. ఆ సన్నివేశం నన్ను ఐదారు దశాబ్దాల వెనక్కు లాక్కెళ్లింది. 50, 60 ఏళ్ల క్రితం అదే వయసున్న అమ్మా యిలు గుంపులు గుంపులుగా కొడవళ్లు పట్టుకొని కూలి పనులకు వడివడిగా వెళ్లే దృశ్యం గుర్తొచ్చింది. ఇరవ య్యేళ్ల క్రితం ఆదిలాబాద్‌లో తిరుగుతున్నప్పుడు ఉద యమే పారలు పట్టుకొని పరిగెత్తుతున్న కార్మికులను చూశాను. 60 ఏళ్లలో ఎంత మార్పు! ఈ మార్పును చైనాలో, పోలెండ్‌లో, అమెరికాలో కూడా చూశాను.
ఈనాడు సామాజిక విప్లవానికి సమాంతరంగా విజ్ఞానంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతు న్నది. దీనికి సంతోషపడుతుంటే దానికి సమాంతరంగా నిరుద్యోగం కూడా పెరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞా నం పుణ్యమా అని చాలా ఉద్యోగాలను యంత్రాల ప్రాతిపదికగా రూపొందిస్తున్నారు. ఒక షిఫ్ట్‌లో వంద మంది చేసే పనిని ఒకే ఒక్క యంత్రం అర నిమిషంలో చేస్తోంది.పెట్టుబడిదారుడు మనిషికన్నా యంత్రాన్నే వ్యాపార సాధనంగా భావిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆవిష్కరణ జరిగితేనే మనిషి సమ స్యలను పరిష్కరించుకోగలుగుతాడు.
నూతన ఆవిష్కర ణలకు మూలం జ్ఞానం. ఇది నాలెడ్జ్ ఎకానమీ. దీనిలో విద్యారంగాన్ని ప్రతిక్షణం మార్చుకుంటూ కొత్త భావా లను దీక్షతో అమలు చేయగలిగితేనే ఆర్థిక రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు, కొత్త సంపదను సృష్టించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పెట్టుబడిదారీ దేశాలు వినియోగంలోకి రుణాలు ఇచ్చి, డబ్బు చలామణీతో ఆర్థిక వ్యవస్థను నడిపించగలిగాయి. అది ఫలితాలివ్వక అక్కడ వాల్‌స్ట్రీట్ ఉద్యమం లేక స్ప్రింగ్ ఉద్యమాలు ఆవిర్భవించాయి.
కాబట్టి విద్యారంగాన్ని కాలానుగుణం గా ఎంత సంస్కరించగలిగితే అంత కొత్త ఆర్థిక వ్యవ స్థను మనం ముందు తరాలకు అందించగలుగుతాం. ఇది ఏదో ఒక దేశం సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నీ ఇదే పరిస్థితిని గమనించి తమ విద్యావ్యవస్థలను సంస్క రించుకుంటున్నాయి. ఇదివరకు ఏ దేశ సమస్యను ఆ దేశమే పరిష్కరించుకొనేది. కానీ నేడు సమస్య ఏ దేశా నిదైనా, దాని పరిష్కారం అనేక దేశాలతో ముడిపడి ఉం టోంది. ఆ పరిష్కారం గ్లోబల్ పరిష్కారంగా మారు తున్నది. ఇప్పుడు దేశ సరిహద్దుల సమస్య కాదు ప్రధా నం.
ఆ దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రజల అనేకా నేక సమస్యలే ప్రధానం. ఆయా సమస్యల ఆధారంగా జరగాల్సిన నూతన ఆవిష్కరణలు వాటికి పరిష్కారం. అలాంటి ఆవిష్కరణలకు పునాది నిర్మించుకోవడానికి విశ్వవిద్యాలయాలనే కాదు, చిన్న తరగతుల నుంచి కూడా మన బోధనా పద్ధతులు మార్చుకోవాలి. వెనుకటి కాలంలో పుస్తకాలలో ముద్రించింది బోధిస్తే సరిపోయే ది. కానీ దానితో గత సమాజమే ఆవిష్కృతం అవుతుం ది. అంతే తప్ప ప్రస్తుత సమస్యకు పరిష్కారం దొరకదు.
చరిత్రను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించకపోతే భవిష్యత్తుని నష్టపోతాం. మనం నిన్నటి సమాజం కన్నా రేపటి సమాజం గురించి ఆలోచించవలసి ఉన్నది. రేపు పిల్లవాడికి కావాల్సింది నైపుణ్యం మాత్రమే. అనగా రేపటి సమస్యలను పరిష్కరించడానికి వర్తమాన విద్యా ర్థుల్లో క్లిష్ట సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనను అలవాటుగా మార్చాలి. సృజనాత్మక విద్యా బోధనను అలవర్చాలి. దీనినే క్రిటికల్ థింకింగ్ అం టాం. అది యాంత్రిక బోధన ద్వారా సాధ్యంకాదు. సృజనాత్మకత కావాలి. సమాచార రంగంలో కూడా విప్ల వాలు వచ్చాయి.
ఈనాడు ఒంటరిగా ఆలోచించడం కన్నా నలుగురితో కలసి ఆలోచించడం అవసరం. ఆ నలుగురు ఒకే గదిలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక జట్టుతో కలసి పనిచేసే అలవాటు రావా లి. మనకు కనపడని వ్యక్తులతో కలసి పనిచేయాలి. ఇత రుల సహకారం కావాలంటే వారి నాగరికత, సంస్కృతి అలవాట్లను గౌరవించే లక్షణం కూడా ఉండాలి. దాన్నే టీం స్పిరిట్ అంటారు. టీం స్పిరిట్ కావాలంటే మన అభిప్రాయాలను ఇతరులకు అందజేసే శాసనాలపైన మనకు అభినివేశం కావాలి. అనగా ఓరల్ కమ్యూని కేషన్, రిటెన్ కమ్యూనికేషన్ ఉంటేనే ఇతరులతో కలసి ఆలోచించవచ్చు.
కాబట్టి ఈనాటి విద్యార్థికి కంఠస్థం చేయడంకన్నా కొత్త సమాజం సృష్టించేందుకు నైపుణ్యం కావాలి. అందుకు పునాది మన తరగతి గదిలోనే పడవ లసి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగానికీ, ఆర్థిక రంగానికీ విద్యాలయాలు తోడైతేనే క్లాసులో కనపడే విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి, జీవించే లక్షణం ఏర్పడ తాయి. నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థిక వ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే మీ దగ్గర ఉన్న విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ఈనాటి సవాలు ఇదే. విద్యారంగంతో సంబంధమున్న వారంతా దీనికి సమాయత్తం కావాలి. అప్పుడే ఈ ప్రజాస్వామిక వ్యవ స్థలో భాగస్వాములమవుతాం. లేకుంటే కూలీలుగానే మిగిలిపోతాం.
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)