జీవ సాంకేతిక పరిజ్ఞానంతో సత్ఫలితాలు
అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు, అధికారులు
తిరుపతి సిటీ: వ్యవసాయంలో జన్యుమార్పిడితోనే భవిష్యత్తులో సాగుకు సుస్థిరత ఉంటుందని వ్యవసాయ యూనివర్సిటీ విస్తరణ సంచాల కులు ఫ్రొఫెసర్ కె.రాజారెడ్డి తెలి పారు. ఆచార్య ఎన్జీరంగా ప్రాంతీ య వ్యవసాయ పరిశోధన కేంద్రం లో మంగళవారం జన్యుమార్పిడి పంటల పరిశీలన, చేపట్టాల్సిన పరిశోధనలు అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు ఫ్రొపెసర్ కె.రాజారెడ్డి మాట్లాడుతూ జీవ సాంకేతిక పరిజ్ఞానం మంచి ఫలితాలు ఇస్తుం దన్నారు. బయో టెక్నాలజీ ద్వారా బిటి కాటన్ తయారైందని తెలి పారు. జన్యుమార్పిడి పంటలంటే చాలామందికి తెలియడం లేదని, అందుకే ఆసక్తి చూపడం లేదని, అవగాహన కల్పించాల్సిన అవస రం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.జి.రహమాన్ మాట్లాడుతూ బీటీ పత్తి వచ్చాక తెగుళ్ల బెడద తప్పిందని చెప్పారు. బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల్లో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని తెలిపారు.
జాతీయ బయోటెక్నాలజీ రెగ్యులేటరీ కమిషన్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ బి.శశికిరణ్ మాట్లాడుతూ జీవకోటి, జంతుజాలం, పర్యావరణానికి హానికలగని రీతిలో జన్యుమార్పిడి పంటలను రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ పరిశోధన అధికారి టి.గిరిధర్‌కృష్ణ, ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎన్‌పీ.ఈశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారి మునిప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రమణ , ప్రతిమ, నాగమాధురి, జి.ప్రసాద్, రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.
జన్యుమార్పిడితో...
Published Wed, Dec 30 2015 2:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement