ఫ్యూచర్ చేతికి ‘హెరిటేజ్ రిటైల్’.. | Future Retail buys Heritage's retail business | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్ చేతికి ‘హెరిటేజ్ రిటైల్’..

Published Tue, Nov 8 2016 1:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

ఫ్యూచర్ చేతికి ‘హెరిటేజ్ రిటైల్’.. - Sakshi

ఫ్యూచర్ చేతికి ‘హెరిటేజ్ రిటైల్’..

 బేకరీ, అగ్రి సోర్సింగ్
 విభాగాలు కూడా
 ఫ్యూచర్ రిటైల్‌లో హెరిటేజ్ ఫుడ్స్ 3.65% వాటాలు
 విలువ సుమారు రూ. 295 కోట్లు

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో

 వ్యాపార దిగ్గజం ఫ్యూచర్ రిటైల్ తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ కి చెందిన రిటైల్ వ్యాపార విభాగాన్ని చేజిక్కించుకుంది. దీనికి ప్రతిగా ఫ్యూచర్ రిటైల్‌లో హెరిటేజ్ ఫుడ్‌‌సకి 3.65 శాతం వాటాలు దక్కనున్నాయి. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని హెరిటేజ్ ఫుడ్‌‌స డెరైక్టర్ నారా లోకేశ్ తెలిపారు. సోమవారమిక్కడ డీల్ వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియాని, హెరిటేజ్ ఫుడ్‌‌స ఈడీ నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. వేల్యుయేషన్‌‌స ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌లో హెరిటేజ్‌కి దక్కే వాటాల విలువ సుమారు రూ. 295 కోట్లుగా ఉండగలదని లోకేశ్ చెప్పారు.
 
 రెండు సంస్థలకు ప్రయోజనకరమైన ఈ డీల్ కింద ఫ్యూచర్ రిటైల్‌లో హెరిటేజ్ ఫుడ్స్ మూడో అతి పెద్ద నాన్-ప్రమోటర్ పబ్లిక్ వాటాదారుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సుమారు 124గా ఉన్న రిటైల్ స్టోర్స్ సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 145కి పెరగగలదని ఆయన తెలిపారు. డీల్ ప్రకారం హెరిటేజ్ ఫుడ్‌‌స తన రిటైల్, బేకరీ, అగ్రి సోర్సింగ్, వెటర్నరీ కేర్ వ్యాపార విభాగాలను అనుబంధ సంస్థగా విడగొడుతుంది. ఇందులో వెటర్నరీ మినహా మిగతా విభాగాలను ఫ్యూచర్ రిటైల్‌లో విలీనం చేయనుంది.
 
 దేశవ్యాప్తంగా హెరిటేజ్ ఉత్పత్తుల విక్రయానికి, దక్షిణాదిలో ఫ్యూచర్ రిటైల్ విస్తరించడానికి, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల అమ్మకానికి ఇది తోడ్పడనుంది. ఇకపై డెయిరీ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు లోకేశ్ తెలిపారు. ఏటా దాదాపు రూ. 100-110 కోట్ల పెట్టుబడులు యథాప్రకారం కొనసాగగలవన్నారు. ప్రస్తుతం సుమారు 13 లక్షల లీటర్లుగా ఉన్న పాలసేకరణను మరికొన్నేళ్లలో 30 లక్షల లీటర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. తమ రిటైల్ కార్యకలాపాల విస్తరణకు ఫ్యూచర్ రిటైల్ సరైన భాగస్వామిగా బ్రహ్మణి అభివర్ణించారు. ఉద్యోగాల తగ్గింపు మొదలైన చర్యలు ఉండబోవన్నారు.
 
 2021 నాటికి 3,000 స్టోర్స్ ..
 దక్షిణాదిలోని మూడు కీలక నగరాల్లోకి కస్టమర్లకు మరింత చేరువయ్యే దిశగా ఈ డీల్ తమకు ఉపయోగపడగలదని బియానీ చెప్పారు. హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్స్ ఇకపైనా అదే బ్రాండ్ కింద కొనసాగుతాయని, అయితే వృద్ధి మరింత వేగంగా ఉండగలదని ఆయన తెలిపారు. 2021 నాటికల్లా తాము చిన్న ఫార్మాట్ స్టోర్స్ సంఖ్యను 3,000కు పెంచుకోనున్నట్లు తెలిపారు. మరో 1,000 స్టోర్స్ ఫ్రాంచైజీ విధానంలో ఉండగలవన్నారు. వీటిలో సగభాగం దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు బియానీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 700 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయని ఆయన వివరించారు. పెట్టుబడుల ప్రణాళికలను వివరిస్తూ.. ఏటా సుమారు రూ. 300-500 కోట్లు పెట్టుబడుల విధానాన్ని ఇకపైనా కొనసాగించగలమని పేర్కొన్నారు.
 
 పస్తుతం తమ వ్యాపారంలో సొంత బ్రాండ్‌‌స వాటా 40 శాతం మేర ఉండగా.. 2021 నాటికి దీన్ని 70 శాతానికి పెంచుకోనున్నట్లు బియానీ తెలిపారు. డీల్ వల్ల రిటైల్ విభాగం నుంచి వచ్చే సుమారు రూ. 600 కోట్ల మేర ఆదాయం తగ్గినా.. ఇటీవలే కొనుగోలు చేసిన రిలయన్‌‌స రిటైల్ డెయిరీ విభాగం అందులో దాదాపు సగభాగం భర్తీ చేసే అవకాశముందని లోకేశ్ చెప్పారు. డీల్ ప్రకటన నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో హెరిటేజ్ ఫుడ్‌‌స షేరు ధర దాదాపు 10 శాతం పెరిగి రూ. 879 60 వద్ద, ఫ్యూచర్ రిటైల్ షేరు ధర 1.3 శాతం పెరుగుదలతో రూ. 152.65 వద్ద ముగిసింది.
 
 1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్‌‌స ప్రస్తుతం డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ తదితర ఆరు వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహా రాష్ట్ర మొదలైన 10 రాష్ట్రాల్లో ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఇటీవలే రిలయన్‌‌స రిటైల్‌కి చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేసింది. 2006లో ప్రారంభించిన రిటైల్ వ్యాపార విభాగం కింద హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 124 హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ స్టోర్స్ ఉన్నారుు.
 
 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్‌‌స రూ. 641 కోట్ల ఆదాయంపై సుమారు రూ. 16 కోట్ల లాభం ఆర్జించింది. రిటైల్ విభాగం అమ్మకాలు రూ. 175 కోట్లు కాగా రూ. 6 కోట్ల నష్టం నమోదైంది. మరోవైపు, బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హోమ్ టౌన్ తదితర రిటైల్ సంస్థలను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ ఇటీవలే భారతి రిటైల్‌కు చెందిన ఈజీడే నెట్‌వర్క్‌ను విలీనం చేసుకుంది. అంతక్రితం నీలగిరీస్, ఆధార్ మొదలైన రిటైల్ చెయిన్‌‌సను కొనుగోలు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement