కొత్తూరులో మొక్కలు నాటుతున్న కలెక్టర్ శ్రీదేవి తదితరులు
భావి తరాలకు మేలు చేద్దాం
Published Sat, Jul 23 2016 8:26 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– సారారహిత జిల్లాగా కొనసాగిద్దాం
– ‘హరితహారం’లో కలెక్టర్ టీకే శ్రీదేవి
భూత్పూర్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భావి తరాలకు మేలు కలిగేలా చూడాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పిలుపునిచ్చారు. శనివారం భూత్పూర్ మండలంలోని కొత్తూరు, తాటిపర్తిలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో అడవుల విస్తీర్ణం కేవలం 16శాతం మాత్రమేనన్నారు. ఇవి రోజురోజుకూ తరిగిపోతుండటంతో సకాలంలో వర్షాలు కురియక కరువు ప్రాంతాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పోవాలంటే ఏటా ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాను సారారహితంగా కొనసాగించాలన్నారు. విరివిగా ఈత మొక్కలు నాటి ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకుగాను ఎక్సైజ్ శాఖ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్‌లు జంగమ్మ, ఫసియొద్దీన్, ఎంపీపీ సుకన్యానారాయణగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమౌళి, ఎంపీటీసీ సభ్యురాలు సరిత, ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేష్, ఆర్‌డీఓ వనజాదేవి, ఎంపీడీఓ గోపాల్‌నాయక్, తహసీల్దార్ జ్యోతి, జడ్చర్ల ఎస్‌ఐ జనార్దన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement