అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్
హుజూరాబాద్ : తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్లాన్(టీఎండీపీ) నిధులతో హుజూరాబాద్ పట్టణంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఆర్‌అండ్‌బీ, ఐబీ శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. పనుల ప్రగతిపై అధికారులనడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ట్ర యల్ రన్ చేయడానికి అవసరమైనవిధంగా పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించా రు. మరో 4 నెలల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వివరించారు.
హుజూరాబాద్ పట్టణంలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదనలపై మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా చేపట్టనున్న జంక్షన్ల ఏర్పాటు, పనుల నిర్వహణలో చేర్పులుమార్పులపై పలు సూచనలు చేశారు. రూ.కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హుజూ రాబాద్–జమ్మికుంట రోడ్డు వెడల్పు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగారు.
రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న యజమానులు నష్టపరిహారం అడుగుతున్నారని, దీంతో కొంత ఆలస్యమవుతున్నట్లు అధికారులు వివరించారు. పట్టణ సమీపంలోని మోడల్ చెరువు వద్ద చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనుల ప్రగతి వివరాలడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో బోయపాటి చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి, పబ్లిక్ హెల్త్ ఈఈ భద్రయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవాచార్యులు, డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రాజునాయక్, మున్సిపల్ ఇంజినీర్ చంద్రమౌళి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment