న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 624 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించిన రుణ నష్టం ప్రధానంగా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్.. దివాలా చట్ట చర్యలను ఎదుర్కొంటోంది.
కాగా.. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో ఫ్యూచర్ సప్లై కేవలం రూ. 19 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇక మొత్తం ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 134 కోట్లకు పరిమితమైంది. 2020–21 క్యూ4లో ఫ్యూచర్ సప్లై రూ. 150 కోట్ల ఆదాయం సాధించింది. బోర్డులో ఖాళీల కారణంగా సమావేశాన్ని నిర్వహించలేకపోవడంతో క్యూ4 ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ బాటలో గ్రూప్‌లోని పలు కంపెనీల క్యూ4 ఫలితాలు సైతం ఆలస్యమైన సంగతి తెలిసిందే.
ఫలితాల నేపథ్యంలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేరు
ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 28.5 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment