భవిష్యత్ కోసం నీటిని దాచుకోవాలి: స్పీకర్ | save water for our future | Sakshi
Sakshi News home page

భవిష్యత్ కోసం నీటిని దాచుకోవాలి: స్పీకర్

Published Sun, May 8 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

భవిష్యత్ కోసం నీటిని దాచుకోవాలి: స్పీకర్

భవిష్యత్ కోసం నీటిని దాచుకోవాలి: స్పీకర్

మానవ తప్పిదాల వల్లే నీటి కొరత ఏర్పడిందని, భవిష్యత్ అవసరాల కోసం డబ్బు లానే నీటిని కూడా దాచుకోవాలని

సాక్షి, హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే నీటి కొరత ఏర్పడిందని, భవిష్యత్ అవసరాల కోసం డబ్బు లానే నీటిని కూడా దాచుకోవాలని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. శాసనసభ ప్రాంగణంలో శనివారం ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశమంతా నీటి కోసం అల్లాడుతోందని, ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విచక్షణా రహితంగా వ్యవహరిస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నీటి వనరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చేపట్టిందన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement