రైతు ఇష్టపడితేనే భూ సమీకరణ | Farmers are willing to mobilization of land | Sakshi
Sakshi News home page

రైతు ఇష్టపడితేనే భూ సమీకరణ

Published Thu, Dec 25 2014 1:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతు ఇష్టపడితేనే భూ సమీకరణ - Sakshi

రైతు ఇష్టపడితేనే భూ సమీకరణ

  • జనచైతన్య వేదిక సభలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి
  • రైతుకు ఇష్టంలేకుండా ప్రభుత్వం భూసమీకరణ చేయలేదు
  • సేకరించే భూమి ఎంతో తేల్చకుండానే ఆ భూమిలో మాస్టర్ ప్లాన్‌కు ఒప్పందాలేంటి?
  • సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం పొందినప్పటికీ ఆ ప్రాంత రైతులందరూ ఇష్టపడి భూమి ఇవ్వడానికి ముందుకొస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ చేయడం సాధ్యం కాదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ సమీకరణకు సుముఖంగా లేని రైతులు అసెంబ్లీలో బిల్లు చేశారని ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సభలో ఆమోదం పొందిన బిల్లులోనే రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని వివరించారు.
     
    జనచైతన్య వేదిక హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని- రైతుకు భూ సమీకరణ లాభమా? భూ సేకరణ లాభమా’ అన్న అంశం జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిం చగా, హైకోర్టు న్యాయవాది రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని వ్యవహా రంపై జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విలేకరులతో ముఖాముఖిగా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న భూ సమీకరణ విధానం లో కన్నా కేంద్ర ప్రభు త్వం ఇటీవల తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం ద్వారానే భూములు ఇచ్చే రైతులు, భూమి లేని రైతులు, కూలీలు ఎన్నో అధిక ప్రయోజనాలు పొందుతారని వివరించారు.

    భూసమీకరణ విధానంలో చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామంటున్న ప్రతి ఎకరా భూమికి వెయ్యి గజాల అభివృద్ధి చేసిన భూమి భూసేకరణ ప్రక్రియలోనూ ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉం టుందన్నారు. అదనంగా ప్రతి ఎకరాకు భూమి అప్పగించిన రోజే నాలుగు రెట్ల మార్కెట్ ధర చెల్లించడంతో పాటు ప్రతి ఇంటిలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాలపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు ఈనెల 26వ తేదీన(శుక్రవారం) రాజధాని గ్రామాల్లో తమ బృందం పర్యటిస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురాకుండా రైతులను భూములిచ్చి త్యాగం చేయాలని కోరుతోందని దుయ్యబట్టారు.
     
    ఆరు విజయవాడలంత స్థలంలో రేపు రైతుకు రేటెలా వస్తుంది?

    ప్రస్తుత విజయవాడ నగరానికి ఆరు రెట్ల విస్తీర్ణంలో కొత్త రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తున్నప్పుడు భూములిచ్చిన రైతులకు అందే వెయ్యి గజాల భూమికి భవిష్యత్‌లో గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఎలా సాధ్యమని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రశ్నించారు. భూములిచ్చిన రైతులందరికే కోటి పైగా చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలం ఇస్తుండగా, డెవలపర్లు మరో కోటి చదరపు గజాలు స్థలాలు దక్కుతుందని చెప్పారు. ఒకేసారి అంత మొత్తం భూమి అమ్మకానికి పెట్టినప్పుడు గజం కనీసం రూ. 20 వేలకైనా కొన డానికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు.

    అభివృద్ధి పరిచిన భూమికి గిట్టుబాటు ధ ర ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటుందని ఎందుకు ప్రకటన చేయడం లేదన్నారు. ఎక్కడైనా ఒక భూమిపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటూ మొదట ఆ భూమి విస్తీర్ణం ఎంతో ప్రకటించాల్సి ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎంత భూమి సేకరించేదీ స్పష్టత ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్‌కు ఎంవోయూ కూడా చేసుకున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు.తమకున్న అను మానాలను ఆయన పైవిధంగా వివరించారు.

    ఏ విధానంలో రైతుకు ఎంత లాభం?
    భూ సమీకరణ ద్వారా..

    హాపూలింగ్‌లో రైతులకు 1,300 చ. గజాలు.

    హాఎకరాకు 1,000చ.గ. అభివృద్ధి చేసిన భూమి.

    హామరో 200 -300 చ.గ వ్యాపార స్థలం.
     
    హాభూమి తీసుకున్న రోజు రూ.1 కూడా ఇవ్వరు.
     
    భూమి ఇచ్చినందుకు మెట్ట రైతుకు రూ.30 వేలు, మాగాణికి రూ.50 వేలు పదేళ్లు ఇస్తారు.

    భూములిచ్చిన రైతు కుటుంబానికి ఉద్యోగం  ఇచ్చే సదుపాయం ఉండదు.    

    కౌలు రైతులు, కూలీలకు కేవలం ప్రతి నెలా రూ.2500 పదేళ్ల పాటు చెల్లిస్తారు.

    ఈ విధానంలో ప్రభుత్వం కల్పించే  సౌకర్యాలకు చట్టబద్ధత లేదు.
     
     భూ సేకరణతో..
    భూ సేకరణలో 1,000 గజాలు + ఉద్యోగం+ 4 రెట్ల భూమి ధర.

    హాఎకరాకు 1,000 చ.గ. అభివృద్ధి చేసిన భూమి

    భూమి అప్పజెప్పిన రోజే మార్కెట్ ధరకు నాలుగు రెట్లు చెల్లింపు. అక్కడ ఉండే ధరను బట్టి ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.కోటి వరకు భూమి తీసుకున్న రోజే చెల్లించాల్సి ఉం టుంది. ఈ డబ్బుతో వెంటనే వేరే చోట కోల్పోయిన దానికన్నా ఎక్కువ భూములు కొనుక్కోవచ్చు. వడ్డీకి ఇచ్చినా ఎకరాపైనే నెలకు లక్షకుపైబడి  ఆదాయం.

    రైతుకు ఏడాది పాటు ప్రతి నెలా రూ.3 వేలు. రవాణా ఖర్చులకు ఒకేసారి రూ.50 వేలు, పశువుల షెడ్డుకు రూ.25 వేలు ఇస్తారు. అదనంగా కుటుంబానికి ఒకే విడతలో మరో రూ.50 వేలు  
     
    పునరావాసంలో ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగం లేదంటే ఒకేసారి రూ.5 లక్షల పరిహా రం లేదంటే ప్రతి నెలా రెండు రూ.వేలకు తగ్గకుండా ఏటా పెంచుతూ 20 ఏళ్లు ఇస్తారు.
     
    హారాజధాని గ్రామాల్లో నివాసం ఉండే కూలీ లు, కౌలు రైతులకు, మూడేళ్ల పాటు గ్రామంలో నివాసం ఉన్న వారికి ఉద్యోగం లేదంటే రూ. ఐదు లక్షల పరిహారం లేదా ప్రతి నెలా రూ. రెండు వేలకు తగ్గకుండా 20 ఏళ్లు ఇస్తారు.
     
    వీటికి పూర్తి చట్టబద్ధత ఉంది.


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement