- రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో భయాందోళన
- కౌలు సొమ్ము తీసుకొనేందుకు వెనుకంజ
- కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం
- వైఎస్సార్ సీపీ అండగా ఉందనే ధైర్యం
మంగళగిరి : రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కౌలు చెక్కులు తీసు కొనేందుకు ససేమిరా అంటున్నారు. చెక్కులు తీసుకున్న వెంటనే భూములు ఖాళీ చేయాల్సిందేనని సీఆర్‌డీఏ చట్టం స్పష్టం చేస్తుండడంతో రైతులు భయపడుతున్నారు. కౌలు చెక్కులు తీసుకొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 17,500 ఎకరాలు భూసమీకరణ చేయాలని మొదట్లో నోటిఫికేషన్ ఇవ్వగా, అసైన్డ్ భూములతో కలుపుకుని 8,700 ఎకరాలకు మాత్రమే అంగీకారపత్రాలు వచ్చాయి.
ఆయా గ్రామాల్లో నెల రోజుల నుంచి కౌలు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారులకు అడుగడుగునా చుక్కెదురవుతోంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఐదు శాతం మంది రైతులు కూడా కౌలు చెక్కులు తీసుకోకపోవడం వెనుక ప్రధానంగా రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. భూసమీకరణపై రైతులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ఇది రైతులకు ఊరట కలిగించింది.
ఇక తొలి నుంచి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)అండగా నిలవడం, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆయన సాగిస్తున్న పోరాటం రైతులకు మరింత ధైర్యాన్నిచ్చింది. తమ భూములు ఎక్కడికీపోవనే ధ్యైర్యంతో ఉన్నారు. ఈ క్రమంలోనే భూములు ఇచ్చిన రైతులు కూడా ప్రస్తుతం కౌలు చెక్కులు తీసుకొనేందుకు ముందుకు రావడం లేదు. చెక్కులు తీసుకుంటే బుక్కు అయినట్టేనని నమ్ముతున్నారు.
సానుకూల గ్రామాల్లో సైతం కష్టమే...
మరో వైపు భూసమీకరణకు సానుకూలంగా వున్న నీరుకొండ గ్రామంలో సైతం ఇప్పటివరకు 1270 ఎకరాలకు 270మంది రైతులు మాత్రమే కౌలు చెక్కులు తీసుకున్నారు. ఇక భ యాందోళనతో భూసమీ కరణకు అంగీకారపత్రాలు ఇచ్చిన నిడమర్రు, బేతపూడి, కురగల్లు, నవులూరు, ఎర్రబాలెం,పెనుమాక, ఉండవల్లి గ్రామాలన్నిటిలో కలిపి 300 ఎకరాలకు మాత్రమే కౌలు చెక్కులు పంపిణీ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక ఆయా గ్రామాల్లో కౌలు చెక్కులు తీసుకున్నది సైతం ఇతరప్రాంతాల వారు కావడం గమనార్హం. కొందరు అధికారులు రైతులకు ఫోన్‌లు చేసి కౌలు చెక్కులు తీసుకోకుంటే కోర్టులో జమచేసి భూములు స్వాధీనం చేసుకుంటామని భయభ్రాంతులకు గురిచే స్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి దేవేంద్ర
Published Mon, Apr 27 2015 2:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement