![Vijayawada: Future Tension For TDP MLA Gadde Rammohan - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/14/TDP-MLA-Gadde-Ramamohan.jpg.webp?itok=c53ZvM1D)
ఆ పసుపు నేత కాలం కలిసొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈ సారి ఆయన పరిస్థితి రివర్స్ అయిందక్కడ. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పడుతున్నాయట. తనకంటే వయసులో చిన్నోడే అయినా... అధికారపార్టీ యువనేతను చూస్తేనే సైకిల్ పార్టీ నేతకు టెన్షన్ ఎక్కువవుతోందట. అందుకే కడుపు మంటను చల్లార్చుకునేందుకు నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడు.
ఏడాది ముందే వెన్నులో వణుకు
ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగానే బెజవాడ టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి భవిష్యత్ గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతోందట. ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ గత రెండు సార్లు విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి గద్దె చేసిందేమీ లేదు.
దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏ పదవిలోనూ లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు. సీఎం జగన్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి.
ముఖ్యంగా సీఎం హామీతో కృష్ణలంక వాసుల చిరకాలవాంఛ అయిన కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ ను 130 కోట్ల రూపాయలతో పూర్తిచేయగలిగారు. నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలతో అవినాష్ ముఖ్యమంత్రి జగన్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు.
డ్రామా పాలిట్రిక్స్
ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లో వణుకు మొదలైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గానికి ఇంఛార్జి హోదాలోనే ఇంత అభివృద్ధి సాధిస్తే...అతన్నే అభ్యర్థిగా ప్రకటించడంతో ..ఇక తన మనుగడ కష్టమని గద్దె డిసైడైపోయారట. రాబోయే ఎన్నికల్లో తనకు పోటీగా దేవినేని అవినాష్ నిలబడితే తనకు డిపాజిట్లు రాననే భయంతో కుట్ర రాజకీయాలకు తెరతీశారు.
వైసీపీ ప్రభుత్వానికి, దేవినేని అవినాష్ కు మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక కడుపుమంటతో గడప గడప కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. అందులో భాగంగానే 17వ డివిజన్ పరిధి రాణీగారితోట ప్రాంతంలో గడప గడప కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్న సమయంలో ఓ టీడీపీ కార్యకర్తతో డ్రామా స్టార్ట్ చేశారు. కావాలనే తమ ఇంటికి అవినాష్ ను పిలిపించి తమకు పథకాలేవీ రావడం లేదంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే వారికి ఏమేమి పథకాలు వచ్చాయో లిస్ట్ చదివి చెప్పడంతో టీడీపీ మహిళా కార్యకర్తలు కిమ్మనకుండా ఉండిపోయారట.
టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం
ముందు నాటకాలు.. తర్వాత గొడవలు
తన పాచిక పారలేదని గ్రహించి తెల్లారేసరికి పథకం ప్రకారం మళ్లీ అదే టీడీపీ మహిళా కార్యకర్తలు స్థానిక వాలంటీర్ తో పాటు వైసీపీ మహిళలతో గొడవకు దిగారు. వారి కళ్లల్లో కారం కొట్టి... దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఈ దాడిని తమకు అనుకూలంగా చేసుకోవాలని గద్దె వేసిన స్కెచ్ వర్కవుట్ కాలేదట. తన ప్లాన్ బెడిసిగొట్టడంతో పాటు తనకే రివర్స్ అవ్వడంతో గద్దె షాక్ లో ఉన్నారట.
చదవండి: అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!
పథకాలు రావట్లేదని గొడవ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమేమి అందాయో ఆధారాలతో సహా దేవినేని అవినాష్ బయటపెట్టడంతో గద్దె రామ్మోహన్ ను సొంత పార్టీ వాళ్లే అసహ్యించుకుంటున్నారని టాక్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకు తెలిసింది ఇలాంటి చీప్ పాలిట్రిక్సేనా అని తల బాదుకుంటున్నారట స్థానిక పసుపు క్యాడర్. దేవినేని అవినాష్ చేస్తున్న గడప గడప కార్యక్రమంతో గద్దే రామ్మోహన్‌కు గుబులు మొదలైందనే టాక్ తెలుగుదేశం వర్గాల్లోనే మొదలైంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment