
అనుమానం కుంగదీస్తోందా?
అనుమానం పెనుభూతం అంటారు. కొందరు నీడను చూసి భయపడితే, కొందరు శబ్దాలకు భయపడతారు.
సెల్ఫ్ చెక్
అనుమానం పెనుభూతం అంటారు. కొందరు నీడను చూసి భయపడితే, కొందరు శబ్దాలకు భయపడతారు. మరికొందరు తమను తామే నమ్మరు, ఇతరులను అసలే నమ్మరు. వీటన్నింటికీ కారణం అనుమానమే. దీనికి మానసికపరమైన ఎన్నో విషయాలు కారణం కావచ్చు. దీనివల్ల ఆందోళనకు గురవ్వటం తప్ప ప్రయోజనమేమీ ఉండదు. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే దీనినుంచి బయటపడచ్చు. మీకూ అనుమానం ఉందా?
1. చీకటికి చాలా భయపడతారు. ఒంటరిగా ఉండటం మీవల్ల కాదు.
ఎ. అవును బి. కాదు
2. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు (కరెంట్ బోర్డులో ఉన్న ఫ్లగ్ నుంచి కొంచెం స్పార్క్ రాగానే రూమ్ నుంచి బయటకు పరుగెత్తడం మొదలైనవి).
ఎ. అవును బి. కాదు
3. రాత్రుళ్లు నిద్రపోయేటప్పుడు అడుగుల చప్పుడైతే ఎవరో తెలుసుకోకనే భయపడతారు.
ఎ. అవును బి. కాదు
4. మీ స్నేహితులకు జరిగిట్లే మీకూ జరుగుతాయని నమ్ముతారు.
ఎ. అవును బి. కాదు
5. ఒక్కరే నడిచేటప్పుడు చాలాసార్లు వెనకకు చూసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. భవిష్యత్తు సరిగా ఉండదనే భయంతో, ఫ్యూచర్‌ని తలచుకుని కుమిలిపోతుంటారు.
ఎ. అవును బి. కాదు
7. తేలికగా ఎవరినీ నమ్మరు, ఇతరులతో కలివిడిగా ఉండరు.
ఎ. అవును బి. కాదు
8. వాస్తవాలను, అవాస్తవాలను సరిగా గుర్తించలేరు.
ఎ. అవును బి. కాదు
9. భయంగొలిపే సినిమాలను చూడరు. సినిమాలో సంఘటనలు వెంటాడతాయని భయం.
ఎ. అవును బి. కాదు
10. ఎదుటివారు మిమ్మల్ని హేళన చేస్తున్నారని మీ నమ్మకం.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఏడు దాటితే మీరు అనుమానంతో కుంగిపోతుంటారు. లేని విషయాలను తలచుకొని చింతిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ‘బి’ లు ‘ఎ’ల కన్నా ఎక్కువ వస్తే మీలో పెద్దగా అనుమానాలు లేవని, చిన్న చిన్నవి ఉన్నా ప్రయత్నిస్తే వాటి నుంచి బయటపడగలరని అర్థం.