మనం కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు మన గుర్తుగా అక్కడున్న ఏదైనా రాళ్లపై కానీ చెట్టుపై కానీ మన పేర్లు రాసుకుంటాం. ఇది చాలా మంది చేసే పనే. అయితే ఈ అలవాటు డాక్టర్లకు ఉంటే..! ఏం చేస్తారు వాళ్లు కూడా ఏదైనా చెట్టునో రాయినో చూసుకుని పేరు రాసేస్తారని అనుకుంటున్నారా..? అయితే ఓ డాక్టర్ మాత్రం మీ అంచనాలను తలకిందులు చేసి ఓ రోగి కాలేయంపై పేరు రాసుకున్నాడు..! ఒక్కరిపై కాదు ఇద్దరు రోగుల కాలేయాలపై..! బ్రిటన్‌కు చెందిన సైమన్ బ్రమ్‌హాల్ ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు. 2013లో ఓ మహిళ, ఓ పురుషుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేశాడు.
అంతటితో ఆగకుండా వారి కాలేయాలపై తన పేరును సంక్షిప్తంగా ‘ఎస్‌బీ’ అని రాసుకున్నాడు. ఆపరేషన్ చేసేటప్పుడు బ్లీడింగ్ జరగకుండా వాడే ఆర్గాన్ కాంతి కిరణాల ద్వారా ఈ పేరును రాసుకున్నాడు. తర్వాత ఆ మహిళకు మరో ఆపరేషన్ చేసిన ఇంకో డాక్టర్ ఈ విషయాన్ని గుర్తించడంతో బయటికి పొక్కింది. ఈ నేపథ్యంలో సైమన్‌పై కేసు నమోదు కావడంతో కోర్టు ముందు దోషిగా నిలుచున్నాడు..
పిచ్చి రాతల డాక్టర్
Published Sun, Dec 17 2017 1:26 AM | Last Updated on Sun, Dec 17 2017 1:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment