
సినిమాల్లో గ్రాఫిక్స్ ద్వారా చూపించే ఇసుక తుఫానులను చూసి ఉంటాం. కానీ మనదేశంలో ఇలాంటి తక్కువే. ఎడారి ప్రాంత దేశాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. తాజాగా... సౌదీ అరేబియా దేశంలో తాజాగా దుమ్ము, ఇసుకతో కూడిన తుఫానులు అంతెత్తుకు వ్యాపించాయి. విమానాల ప్రయాణాలకు కూడా ఆటంకం కలిగించాయి. అయితే ఈ దృశ్యాన్ని విమానంలోంచి ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
దుమ్ము, ఇసుక తుఫానుల కారణంగా వాతావరణం సరిగా లేదని సౌదీ అరేబియాకు దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానాన్ని ల్యాండ్‌చేశారు. అక్కడ రన్‌వే కూడా సరిగా లేకపోయినా...మొత్తం దుమ్ముతో నిండిపోయినా పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్‌చేశాడు. అయితే ఇప్పుడు ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment