Flights and trains
-
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
బీజింగ్: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్వే, హై-స్పీడ్ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep— Jim (@yangyubin1998) April 12, 2025 -
ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు
ముంబయిలో కురిసిన భారీ వర్షానికి విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసందానంగా ఉన్న రైలు రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలో నీరు చేరడంతో సర్వీసులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుమొత్తం 14 విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇండిగోకు చెందిన తొమ్మిది విమానాలు, విస్తారా-రెండు, ఎయిరిండియా, ఆకాసా ఎయిర్, గల్ఫ్ ఎయిర్ ఒక్కోటి చొప్పున ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఆయా విమానాలను హైదరాబాద్‌కు ఏడు, అహ్మదాబాద్‌కు నాలుగు, గోవాకు రెండు, ఉదయపూర్(1)కు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నగరంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
రెండో రోజూ అదే తీరు
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పొగమంచు తీవ్రత పెరిగింది. జాతీయ రాజధాని ప్రాంతంలోనూ దట్టమైన పొగమంచు ఆవరించింది. సోమవారం మొదలైన ఈ పొగమంచు తీవ్రత మంగళవారం మరింత పెరిగింది. దీనివల్ల దృశ్యగోచరత 50 మీటర్ల కన్నా తగ్గిపోవడంతో అనేక రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమాన సేవలను, రైళ్లను రద్దు చేశారు. దాదాపు 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. పొగమంచు కారణంగా దృశ్యగోచరత బాగా తగ్గిపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ఐదు గంటల నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. దాదాపు ఐదు గంటలపాటు విమానాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. విమానాశ్రయంలో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద వంద మంది ప్రయాణికులు గుమిగూడి ఉండడం కనిపించింది. పొగమంచు కారణంగా 224 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో 179 జాతీయ, 45 అంతర్జాతీయ విమానాలున్నాయి. విమానాలు రన్‌వేపై దిగాలంటే కనీసం 50 మీటర్ల దృశ్యగోచరత ఉండాలి. విమానం రన్‌వేపై నుంచి ఎగరాలంటే విమానం ఆకృతిని బట్టి కనీసం 125 నుంచి 150 మీటర్ల దృశ్యగోచరత ఉండాలి. దీని కన్నా తక్కువగా ఉండటంతో విమాన రాకపోకలను నిలిపివేశామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల కోసం, జాగింగ్ కోసం రోడ్డెక్కిన నగరవాసులు పొగమంచు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు బయలుదేరిన ఢిల్లీవాసులు చలితో వణికిపోయారు. వెలుతురు సరిగా కనిపించక వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం పొగమంచు వల్ల గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌పై రోడ్డుప్రమాదం జరిగింది. జీరోపాయింట్ , జెవార్ టోల్ ప్ల్లాజాల మధ్య ఓ టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొనడంతో నలుగురు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో చేర్పించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదని, మద్యం తాగిన డ్రైవర్ బస్సును అతివేగంగా నడిపాడని సమాచారం. ఉమ్రావ్కు వెళ్తున్న బస్సు జెవార్ టోల్ ప్లాజాకు వస్తుండగా ట్రక్కు ఢీకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.