ముంబయిలో కురిసిన భారీ వర్షానికి విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసందానంగా ఉన్న రైలు రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలో నీరు చేరడంతో సర్వీసులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
మొత్తం 14 విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇండిగోకు చెందిన తొమ్మిది విమానాలు, విస్తారా-రెండు, ఎయిరిండియా, ఆకాసా ఎయిర్, గల్ఫ్ ఎయిర్ ఒక్కోటి చొప్పున ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఆయా విమానాలను హైదరాబాద్‌కు ఏడు, అహ్మదాబాద్‌కు నాలుగు, గోవాకు రెండు, ఉదయపూర్(1)కు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నగరంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment