వలిగొండ: నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వలిగొండ మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన గోపీ(20) బైకుపై బుధవారం సాయంత్రం వలిగొండ నుంచి భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కిందపడిపోయిన గోపీ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈకేసుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.