చిత్తూరులో దంపతుల బలవన్మరణం | Couple Suicide Attempt At Chittoor District | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 26 2015 11:05 AM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని మెకానికల్ గ్రౌండ్ ప్రాంతంలోని మిట్టూరులో నివాసం ఉంటున్న గోపి(36), ఉమా మహేశ్వరి(32) అనే దంపతులు మంగళవారం అర్థరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నారు. బుధవారం ఉదయం చుట్టు పక్కల వారు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement