uma maheswari
-
అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్
-
అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్
ఇటీవల నందమూరి ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం(ఆగస్ట్ 1న) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతితో మరోసారి నందమూరి ఫ్యామిలీ విషాదంలోకి వెళ్లింది. కాగా కొంతమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో బుధవారం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. మేనత్త అంత్యక్రియల్లో నందమూరి హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబం కనిపించలేదు. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఇండియాకు తిరిగొచ్చిన తారక్ తన భార్య ప్రణతి, తల్లి శాలినితో పాటు అన్న కల్యాణ్ రామ్‌తో కలిసి మేనత్త ఇంటికి వెళ్లాడు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మేనత్త మృతిపై కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. కాగా ఉమ అంత్యక్రియల్లో నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు -
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
-
ఉమా మహేశ్వరి అంత్యక్రియలు, పాడె మోసిన బాలయ్య
-
ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం మృతి చెందిన ఉమకు నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆమె అంతిమయాత్ర జరిగింది. ఈ మేరకు సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు ఉమ పాడె మోసిన దృశ్యం అందరి చేత కంటతడి పెట్టించింది. సంప్రదాయ ప్రకారం ఉమామహేశ్వరి అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె చితికి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పటించారు. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఉమ అంత్యక్రియలు ముగియగా ఆమెను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హజరయ్యారు. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. -
ఉమామహేశ్వరికి ప్రముఖుల నివాళి
బంజారాహిల్స్ (హైదరాబాద్): దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి భౌతికకాయానికి మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లోని ఆమె నివాసంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఉమామహేశ్వరి సోదరీమణులు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, రామకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఉమామహేశ్వరి మృతిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అమెరికా నుంచి పెద్ద కుమార్తె విశాల అర్ధరాత్రి ఇక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఉమామహేశ్వరి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కొంతకాలంగా అనారోగ్యం, తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడికి సంబంధించి వైద్యం కూడా చేయించుకుంటున్నారు. అయితే ఒంటరితనం ఆమెను తీవ్రంగా బాధిస్తున్నట్లు గతంలో జరిగిన రెండు సంఘటనలు వెల్లడిస్తున్నాయి. మూడు నెలల కాలంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. ఒకసారి 40 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి చేర్చగా ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే మరోసారి నిద్రమాత్రలు మింగారు. ఆ సమయంలో కూడా కుటుంబ సభ్యులు గుర్తించడంతో చికిత్స అనంతరం ఆమె బయటపడ్డారు. చిన్న కూతురు దీక్షిత పెళ్లి జరిగిన అనంతరం ఉమామహేశ్వరి మరింత ఒంటరితనానికి గురైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లి మరణంపై కీలక విషయాలు వెల్లడించిన ఉమామహేశ్వరి కుమార్తె
-
అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత
దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కాగా అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురే ఉమా మహేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు విశాల, దీక్షిత. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన -
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
-
నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాప కుడు నందమూరి తారక రామారావు చిన్న (నాలుగో) కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బేకరీ వ్యాపారంలో ఉమామహేశ్వరి.. బేకరీ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఉమా మహే శ్వరి జూబ్లీహిల్స్ రోడ్ నం.9 లోని ప్లాట్ నం.73లో తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలిసి నివా సం ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ వ్యాపారి కావడంతో మూడురోజుల క్రితం పనుల నిమి త్తం బయట రాష్ట్రానికి వెళ్లారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమా ర్తె దీక్షిత నగరంలోనే భర్త రాహుల్ చౌదరితో కలిసి ఉంటున్నారు. వంట చేయమని చెప్పి గదిలోకి వెళ్లి.. సోమవారం ఉదయం 10.30 గంటలకు బాచుపల్లిలో ఉండే దీక్షిత, ఆమె భర్త, ఉమా మహేశ్వరి ఆడపడుచు నిరుపమ ఆమె ఇంటికి వచ్చారు. వీరికి వంట చేయమని వంట మనిషికి చెప్పిన ఉమా మహేశ్వరి మధ్యాహ్నం 12 గంటలకు తన గదిలోకి వెళ్ళారు. 12.30కి పనిమనిషి బీబీ వెళ్లి డోర్ కొట్టినా ఎంతకూ తలుపులు తీయలేదు. గదిలోకి వెళ్ళిన తల్లి లోపలి నుంచి గడియ పెట్టుకోవడమే కాకుండా భోజనం సమయం అయినప్పటికీ బయటకు రాకపోవడంతో దీక్షితకు అనుమానం వచి్చంది. దీంతో ఆమె వెళ్ళి గది తలుపు కొట్టారు. ఎంతకూ తీయకపోవడంతో మిగిలిన వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్ళి చూశారు. 2.30కి పోలీసులకు సమాచారం ఆ గదిలో ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. అప్పటికే మృతి చెందడంతో కిందకు దింపిన కుటుంబీకులు మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే ఈ విషయం పోస్టుమార్టం సహా ఇతర పరీక్షల్లో నిర్ధారణ కావాల్సి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. నేత్ర దానం ఉమా మహేశ్వరి మరణంపై సమాచారం అందుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకే‹Ù, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ, సమీప బంధువులతో పాటు తీగల కృష్ణారెడ్డి, కంభంపాటి రామ్మోహ¯న్‌రావు ఆమె ఇంటికి చేరుకున్నారు. భార్య మృతి విషయం తెలియడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ తన ఇంటికి చేరుకున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు అభిజిత్, టకియుద్దీన్, రమణమూర్తి నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆ సమయంలో బాలకృష్ణ, రామకృష్ణ, లోకేశ్, శ్రీనివాస్ మార్చురీ వద్దే ఉన్నారు. ఉమా మహేశ్వరి నేత్రాలను కుటుంబీకులు దానం చేయడంతో వాటిని వైద్యులు సేకరించారు. రెండు మూడురోజుల వరకు మృతదేహం పాడవకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి జూబ్లీహిల్స్ నివాసానికి తరలించారు. రేపు అంత్యక్రియలు.. ఉమా మహేశ్వరి ఇటీవలే తన చిన్న కుమార్తె దీక్షిత వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. కాగా ఈ నెల 3న ఉమా మహేశ్వరి మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన తల్లి చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దీక్షిత మీడియాకు వెల్లడించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్ -
ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వివాహిత పోగుల మౌనిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై కె.కిశోర్ కథనం ప్రకారం.. మౌనికకు 10 సంవత్సరాల క్రితం విద్యాసాగర్‌తో వివాహం జరిగింది. పర్వతగిరిలో కంగన్‌హాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యభర్తలు తరచు మనస్తాపానికి గురయ్యేవారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరకట్న వేధింపులకు వివాహిత బలి.. సంగెం: వరకట్న వేధింపులు తాళలేక విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉమామహేశ్వరి(20)ని హైదరాబాద్ బొల్లారానికి చెందిన కొప్పుల కమలాకర్ అలియాస్ కిరణ్‌కు ఇచ్చి గత ఏడాది ఆగష్టు 18న వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంచనాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భర్త కమలాకర్, అత్త పద్మ, మామ పాండు రూ.6 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగారు. రెండు నెలల క్రితం కొట్టి తల్లిగారింటికి పంపించారు. అప్పటి నుంచి లోహితలోనే ఉంటున్న ఉమామహేశ్వరి.. అదనపు కట్నం ఇవ్వలేక, కాపురానికి వెళ్లలేక మనస్తాపం చెంది ఈ నెల 11న విష గుళికలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తల్లి బొల్లేపల్లి సుమలత ఫిర్యాదు మేరకు కమలాకర్, పద్మ, పాండులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్దోజు కిరణ్మయి తెలిపారు. చదవండి: (ప్రియుడితో సహజీనవం, బుల్లితెర నటి ఆత్మహత్య) -
బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత
తమిళ సినిమా: బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఈమె మొట్టి ఒళి టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఒరు కథైయిన్ కథై, మంజల్ మహిమై తదితర సీరియళ్లలో ప్రధాన పాత్ర పోషించారు. వెట్టి చాకిరి, కొడికట్టు, అల్లి అర్జన్ తదితర సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు చేశారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) ఈమె భర్త మురుగన్ పశువైద్యుడు. వివాహానంతరం ఉమా మహేశ్వరి నటనకు స్వస్తి చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నా రు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈమె మృతిపై పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు. చదవండి: (ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్) -
ఉమామహేశ్వరికి న్యాయం జరిగేనా..!
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: భర్త కాపురానికి తీసుకువెళ్లాలంటూ వివాహిత బండి ఉమామహేశ్వరి చేపట్టిన నిరసన దీక్ష నెల రోజులు దాటింది. గత నెల 2న కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో భర్త బండి పూర్ణ సుబ్బారావు పెంపుడు తండ్రి పుసులూరి గంగాధరరావు ఇంటి ముందు ఆమె నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆమె సామాజికవర్గానికి చెందిన సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాయి. అయితే ఫిబ్రవరి 12న ఇరువర్గాలు పెద్దల సమక్షంలో ఒప్పందానికి వచ్చి ఉమామహేశ్వరిని గంగాధరరావు ఇంట ఉండాలని, చర్చల అనంతరం సమస్యను పరిష్కరించవచ్చని సూచించడంతో ఆమె ఒంటరిగా ఆ ఇంట అడుగుపెట్టింది. అయితే పోలీసులు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారితో పాటు సీఐడీ విచారణ జరిగిందని, అయితే ఇప్పటి వరకూ తన ఫిర్యాదుపై స్పష్టత లేదని ఉమామహేశ్వరి ఆరోపిస్తుంది. తన కాపురం చక్కబడుతుందని భర్త కోసం ఎదురు చూస్తున్నానని, తక్షణం న్యాయం జరిగేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇటీవల పోలీసుల సమక్షంలో ఇద్దరిని కౌన్సెలింగ్ కోసం పిలిచారని, అయితే ఏమయ్యింది అనేది సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ న్యాయం కోసం, తన భర్త కోసం పోరాటం చేస్తుంటే పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని బంధువులు, ఉమామహేశ్వరి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి
-
ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి
పశ్చిమగోదావరి, కొవ్వూరు : ప్రేమించి, పెళ్ళి చేసుకుని ఐదేళ్లు కాపురం చేసిన వ్యక్తి ఇపుడు తనను కాదని కట్నంకోసం వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దపడుతున్నాడని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరులో బండి ఉమామహేశ్వరి అనే యువతి నిరాహారదీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ ఎనిమిదిరోజులుగా భర్త ఇంటి ఎదుటే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. నిరసన దీక్ష చేపట్టిన బండి ఉమామహేశ్వరికి వెంటనే న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు, ఆమె బంధువులు డిమాండ్ చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె బంధువులు, మద్దతుదారులు కొవ్వూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గోదావరిపై నాలుగో వంతెన సమీపంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో కొవ్వూరు, రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు మండలాలకు చెందిన ఉమామహేశ్వరి బంధువులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కన్వీనర్లు తానేటి వనిత, గిరిజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని కాపు సంఘం నేత మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. దాదాపుగా పది కిలోమీటర్ల మేర వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు హోరెత్తాయి. మంత్రి కేఎస్ జవహర్, కలెక్టర్, ఎస్పీలు రావాలంటూ నినాదాలు చేశారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో కొనసాగింది. డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఘటనాస్థలానికి చేరుకుని ఉమామహేశ్వరి భర్త దుబాయ్ వెళ్లినట్టు చెప్పారు. అతడిని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోమవారంలోపు దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భార్యభర్తల వివాదాల్లో సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నందున్న కొంత ఇబ్బందులున్నాయన్నారు. దోషులను సత్వరం అరెస్ట్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి రూరల్ కన్వీనర్ గిరిజాల బాబు, కడియం మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీపీ మార్గాని లక్ష్మీ సత్యనారాయణ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు పాలపర్తి కుమారి రోజా ప్రకాష్, కడియపు లంక సర్పంచ్ వారా పాపా రాము, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెలుగుబంటి నాని, తాడాల వీరన్న, ఆలిండియా నర్సరీ ప్రెసిడెంట్ పల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గురుజు బాలమురళీకృష్ణ, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, యాళ్ల నరిసింహ రావు, కొయ్యల భాస్కరరావు, అడ్డూరి సుబ్బారావు,కొవ్వూరు, తాళ్లపూడి మండల కాపు అధ్యక్షులు ఉప్పులూరి రాజేంద్రప్రసాద్, నామా ప్రకాశం పాల్గొన్నారు. న్యాయం చేసేంత వరకూ పోరాటం బాధితురాలికి సోమవారంలోపు న్యాయం చేయకపోతే తానే స్వయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. న్యాయం చేయాలని ఒక ఆడ బిడ్డ తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నా స్థానిక మంత్రి కేఎస్ జవహర్ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బాధితురాలికి అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తెలిపారు. -
నీరసించిన ఉమా మహేశ్వరి..
పశ్చిమగోదావరి , కొవ్వూరు: ఐదేళ్ల కాపురం అనంతరం భర్త నిరాదరణకు గురైన బండి ఉమా మహేశ్వరి(గౌరి) కొవ్వూరు మండలం మద్దూరులో చేపట్టిన నిరసన దీక్ష ఆరో రోజుకు చేరింది. కడియపులంకకు చెందిన ఉమా మహేశ్వరి మద్దూరుకు చెందిన బండి పూర్ణ సుబ్బారావును 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దుబాయ్ వెళ్లిన సుబ్బారావు ఉమా మహేశ్వరికి విడాకులు నోటీసులు పంపించాడు. దీంతో బాధితురాలు మద్దూరులోని సుబ్బారావు పెంపకానికి వచ్చిన అతని పెద నాన్న పుసులూరి గంగాధరరావు ఇంటివద్దనే నిరశన దీక్ష చేపట్టింది. అయితే ఆమె పూర్తిగా నీరసించి పోవడంతో బుధవారం వైద్యులు సెలైన్లు పెట్టారు. అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు అధికార పార్టీ నేతలు సుబ్బారావు కుటుంబానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుని ఐదేళ్ల పాటు కాపురం చేసి ఇప్పుడు విడాకులు ఇవ్వమంటున్నాడని ఓ మహిళ ఆవేదనతో రోడ్డెక్కి భర్త ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే ఇంత వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్ జవహర్ ఆమెను పరామర్శించకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. తనకు న్యాయం చేసి తన కాపురం నిలబెట్టాలని బాధితురాలు దీనంగా వేడుకుంటోంది. మంత్రి అండతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాధితురాలికి పలువురి మద్దతు ఇప్పటికే కాపు సంఘం యువకులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అధికార పార్టీనేతలు బాధితురాలి భర్త పూర్ణ సుబ్బారావుకు అండగా ఉండడం చేతనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఆ పార్టీ నాయకులు బాధితురాలిని పరామర్శించి ఆమెకు బాసటగా నిలిచారు. మాజీ ఎమ్మెల్సీ వైఎస్సార్ సీపీ నేత కందుల దుర్గేష్ బుధవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులిరాలి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టు నరసయ్య, గంగుమళ్ల శేషగిరి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళిత హక్కుల పోరాట సమితి నాయకురాలు ఎండీ సలీమ, బాధితురాలి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిద్దరూ కలిసున్నా అభ్యంతరం లేదు :విలేకరులతో మాట్లాడిన పూర్ణ సుబ్బారావు తల్లిదండ్రులు చాగల్లు: బండి ఉమా మహేశ్వరి దీక్షపై ఎట్టకేలకు చంద్రవరంలో పూర్ణ సుబ్బారావు తల్లిదండ్రులు బండి సత్యనారాయణ, లక్ష్మీ తాయారు స్పందించారు. బుధవారం వారు గ్రామంలో ఎంపీపీ రమామణి ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్రిక్తతలకు తావివ్వకుండా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఐదేళ్ల క్రితం కొవ్వూరు పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరి వివాహం మా ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పారు. సుబ్బారావు చిన్ననాటి నుంచి మద్దూరులో ఉన్న పెదనాన్న వద్ద పెరిగాడని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న వీరి కుటుంబ కలహాలు కూడా తమకు ఏమాత్రం తెలియదన్నారు. అయితే మంగళవారం అమెకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో కొంతమంది తమ ఇంటివద్దకు వచ్చి హడావుడి సృష్టించారన్నారు. కొడుకు, కోడలు కలిసి ఉన్నా మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా తమకు మిగిలిన కుమారుల మీద కూడా కేసులు పెట్టారని సుబ్బారావు తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎంవీ సుబ్బారావు, మాజీ వైస్ ఎంపీపీ మద్దుకూరి వీరరాఘవులు, కోడూరి ప్రసాద్, మద్దుకూరి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లంటే ఆటవస్తువా..!
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: కాపురానికి తీసుకువెళ్లాలని, తనకు న్యాయం కావాలని కోరుతూ కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో వివాహిత బండి ఉమామహేశ్వరి చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి బాధిత మహిళను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా బాధితురాలితో రాజ్యలక్ష్మి గంటకుపైగా మాట్లాడారు. ఉమామహేశ్వరికి అండగా నిలుస్తామని, ఆమె కాపురం నిలబెట్టడానికి కృషి చేస్తామని రాజ్యలక్ష్మి తెలిపారు. భర్త పూర్ణ సుబ్బారావుతో పాటు అతని కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఆడపిల్ల అంటే ఆటబొమ్మలా ఉందని, ఉమామహేశ్వరి భర్త ప్రవర్తనను బట్టి ఉద్దేశపూర్వకంగానే ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు. సంఘటన వివరాలను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి దృష్టికి తీసుకువెళతానని, బాధితురాలికి అండగా ఉంటామన్నారు. కొవ్వూరు రూరల్ సీఐ శరత్ రాజ్‌కుమార్, ఎస్సై జానా సతీష్, తహసీల్దార్ కె.విజయకుమార్, ఐసీడీఎస్ సీడీసీఓ వైబీటీ సుందరి, ఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గురుజు బాలమురళీకృష్ణ తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న మద్దతు ఉమామహేశ్వరి నిరసన దీక్షకు మహిళా సంఘాల మద్దతు కొనసాగుతుంది. నిరసన శిబిరంలో జిల్లా దళిత హక్కుల పోరాట సమితి మహిళా కన్వీనర్ ఎండీ సలీమ, జిల్లా సామాజిక సమస్యల కమిటీ సభ్యురాలు బొరుసు సీతామహాలక్ష్మి, డ్వాక్రా సీఏలు బళ్ల లక్ష్మీమంగతా యారుతో పాటు పలువురు మహిళలు ఆమెకు మద్దతుగా నిరసన దీక్షలో కూర్చున్నారు. -
చిత్తూరులో దంపతుల బలవన్మరణం
-
చిత్తూరులో దంపతుల బలవన్మరణం
లోకనాథం: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని మెకానికల్ గ్రౌండ్ ప్రాంతంలోని మిట్టూరులో నివాసం ఉంటున్న గోపి(36), ఉమా మహేశ్వరి(32) అనే దంపతులు మంగళవారం అర్థరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నారు. బుధవారం ఉదయం చుట్టు పక్కల వారు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తే కాలయముడై..
భీమవరం టౌన్ : తాళికట్టిన భర్తలే కాలయముళ్లుగా మారుతున్నారు. నిత్యం వేధింపులకు గురై లేత వయసులోనే నూరేళ్లు నిండిపోతున్నాయి. నిన్న ఉమామహేశ్వరి ఉదంతం మరిచిపోకముందే భీమవరం ప్రాంతంలో మరో అబల భర్త అకృత్యానికి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గర్భిణిగా ఉందనే కనికరం కూడా లేకుండా ఉన్మాది చేష్టలతో ఉసురుతీశాడు. వివరాల్లోకి వెళితే.. భీమవరం మండలం పెదగరువుకు చెందిన మేడిది వినోద్‌కుమార్.. కొమరాడ గ్రామానికి మరియమ్మను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి మూడేళ్ల కుమార్తె శ్రీకుమారి ఉంది. మరియమ్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. హైదరాబాద్‌లో తాపీ పని చేసుకుంటూ వినోద్‌కుమార్ కుటుంబం కొంతకాలంగా అక్కడే ఉంటోంది. మరియమ్మ తండ్రి డేవిడ్ గతంలోనే చనిపోగా, తల్లి ఆశీర్వాదం దుబాయ్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా, చిన్న చిన్న విషయాలకు కూడా వినోద్‌కుమార్ భార్య మరియమ్మను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. అతనికి దూరంగా వచ్చేయాలని ఎన్నోసార్లు బంధువులు ఆమెకు చెప్పారు. అయినా తన భర్తతోనే ఉంటానని మరియమ్మ వారికి నచ్చజెప్పేది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండగకు మంగళవారం ఉదయం కొమరాడలోని నాన్నమ్మ ఇంటికి వినోద్‌కుమార్ కుటుంబం వచ్చింది. రాత్రి వినోద్‌కుమార్ భార్యతో గొడవకు దిగి ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టాడు. అడ్డువచ్చిన మరియమ్మ నాన్నమ్మ, అమ్మమ్మలను సైతం తోసివేశాడు. దీంతో వారు కేకలు వేయగా స్థానికులు గుమికూడారు. ఇంతలోనే భార్య గొంతు, పొట్టను గట్టిగా నొక్కి హత్య చేశాడు. ఆమె మృతి చెందినా హింసిస్తుండటాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో వినోద్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడ్నించి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి భర్త వినోద్‌కుమార్ కోసం గాలించారు. బుధవారం ఉదయం తహసిల్దార్ గంధం చెన్నుశేషు, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మ నిద్రపోతోంది.. లేపకండి తల్లి నిద్రపోతోందని భావించి అక్కడే ఉన్న చిన్నారి శ్రీకుమారిని చూసి స్థానికులు చలించిపోయారు. మరియమ్మ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులతో తన తల్లి నిద్రిస్తోందని.. లేపవద్దని చెప్పడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిని పోగొట్టుకున్న చిన్నారి భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. భర్తే కావాలంది.. ప్రేమించి పెళ్లాడిన భర్త వినోద్‌కుమార్ అంటే మరియమ్మకు ఇష్టం. అయితే చీటికిమాటికి భార్యతో గొడవపడి భర్త చిత్రహింసలకు గురిచేస్తున్న వినోద్‌కుమార్ ప్రవర్తనతో బంధువులు విసుగు చెందారు. అతని నుంచి దూరంగా ఉండాలని హితవు పలికారు. అయినా మరియమ్మ తనకు భర్తే జీవితమంటూ వారికి నచ్చజెప్పింది. అతనిలో మార్పు వస్తుందని ఆశించింది. అయితే రానురాను అతని ప్రవర్తన మితిమీరడం.. మరియమ్మ తండ్రి లేకపోవడం, తల్లి దుబాయ్‌లో ఉండటం, అమ్మమ్మ, నాన్నమ్మ వృద్ధులు కావడంతో వినోద్‌కుమార్‌ను నిలదీసేవారు లేకపోయారంటూ బంధువులు వాపోతున్నారు. దీంతో అతని చేష్టలు శ్రుతిమించి తమ మనవరాలు బలైందని కన్నీరుమున్నీరయ్యారు.