Jr NTR Visits Uma Maheswari Home With Wife Pranati Mother Shalini - Sakshi
Sakshi News home page

Jr NTR: అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్‌

Published Fri, Aug 5 2022 4:40 PM | Last Updated on Fri, Aug 5 2022 5:10 PM

Jr NTR Visits Uma Maheswari Home With Wife Pranati Mother Shalini - Sakshi

ఇటీవల నందమూరి ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం(ఆగస్ట్‌ 1న)  ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతితో మరోసారి నందమూరి ఫ్యామిలీ విషాదంలోకి వెళ్లింది. కాగా కొంతమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో  బుధవారం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. మేనత్త అంత్యక్రియల్లో నందమూరి హీరోలైన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ కుటుంబం కనిపించలేదు.

చదవండి: మీ మాజీ భర్త షాహిద్‌ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్‌ చూశారా?

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ సమయంలో విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఇండియాకు తిరిగొచ్చిన తారక్‌ తన భార్య ప్రణతి, తల్లి శాలినితో పాటు అన్న కల్యాణ్‌ రామ్‌తో కలిసి మేనత్త ఇంటికి వెళ్లాడు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మేనత్త మృతిపై కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. కాగా ఉమ అంత్యక్రియల్లో నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement