మద్దూరులో భర్త కోసం నిరీక్షిస్తున్న బండి ఉమామహేశ్వరి
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: భర్త కాపురానికి తీసుకువెళ్లాలంటూ వివాహిత బండి ఉమామహేశ్వరి చేపట్టిన నిరసన దీక్ష నెల రోజులు దాటింది. గత నెల 2న కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో భర్త బండి పూర్ణ సుబ్బారావు పెంపుడు తండ్రి పుసులూరి గంగాధరరావు ఇంటి ముందు ఆమె నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆమె సామాజికవర్గానికి చెందిన సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాయి. అయితే ఫిబ్రవరి 12న ఇరువర్గాలు పెద్దల సమక్షంలో ఒప్పందానికి వచ్చి ఉమామహేశ్వరిని గంగాధరరావు ఇంట ఉండాలని, చర్చల అనంతరం సమస్యను పరిష్కరించవచ్చని సూచించడంతో ఆమె ఒంటరిగా ఆ ఇంట అడుగుపెట్టింది.
అయితే పోలీసులు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారితో పాటు సీఐడీ విచారణ జరిగిందని, అయితే ఇప్పటి వరకూ తన ఫిర్యాదుపై స్పష్టత లేదని ఉమామహేశ్వరి ఆరోపిస్తుంది. తన కాపురం చక్కబడుతుందని భర్త కోసం ఎదురు చూస్తున్నానని, తక్షణం న్యాయం జరిగేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇటీవల పోలీసుల సమక్షంలో ఇద్దరిని కౌన్సెలింగ్ కోసం పిలిచారని, అయితే ఏమయ్యింది అనేది సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ న్యాయం కోసం, తన భర్త కోసం పోరాటం చేస్తుంటే పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని బంధువులు, ఉమామహేశ్వరి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment