So Many Tragedy Incidents In Nandamuri Family In August Month - Sakshi
Sakshi News home page

Nandamuri Family: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..

Published Tue, Aug 2 2022 2:11 PM | Last Updated on Tue, Aug 2 2022 3:29 PM

So Many Tragedy Incidents In Nandamuri Family In August Month - Sakshi

దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్‌ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు.

చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్‌ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్‌ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్‌ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్‌ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement