
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం మృతి చెందిన ఉమకు నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆమె అంతిమయాత్ర జరిగింది. ఈ మేరకు సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు ఉమ పాడె మోసిన దృశ్యం అందరి చేత కంటతడి పెట్టించింది.
సంప్రదాయ ప్రకారం ఉమామహేశ్వరి అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె చితికి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పటించారు. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఉమ అంత్యక్రియలు ముగియగా ఆమెను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హజరయ్యారు.
చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
Comments
Please login to add a commentAdd a comment