funeral today
-
ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం మృతి చెందిన ఉమకు నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆమె అంతిమయాత్ర జరిగింది. ఈ మేరకు సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు ఉమ పాడె మోసిన దృశ్యం అందరి చేత కంటతడి పెట్టించింది. సంప్రదాయ ప్రకారం ఉమామహేశ్వరి అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె చితికి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పటించారు. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఉమ అంత్యక్రియలు ముగియగా ఆమెను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హజరయ్యారు. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. -
సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్
బిగ్‌బాస్-13 విన్నర్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బాలీవుడ్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బీ-టౌన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసిందే. తీవ్రమైన గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున్న ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ రోజు ముంబైలోని జూహులో సిద్దార్థ్‌కు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో సహా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, పలువురు టీవీ నటీనటులు అజిమ్ రియాజ్, అర్జున్ బిజ్లానీ, ఆర్తి సింగ్, వికాస్ గుప్తా, రాఖీ సావంత్, అలీ గోని, ప్రిన్స్ నారులా, రషమీ దేశాయ్ తదితరులు సిద్ధార్థ్ ఇంటికి చేరుకున్నారు. చదవండి: Sidharth Shukla: సిద్ధార్థ్ శుక్లా మృతి..షూటింగ్ నుంచి వెళ్లిపోయిన షెహనాజ్ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కాగా సిద్ధార్థ్ అంత్యక్రియలకు అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ సహా కంటెస్టెంట్ షెహనాజ్ గిల్, ఆమె తల్లి కూడా హజరయ్యారు. తల్లితో పాటు కారులో వచ్చిన సెహనాజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండం చూస్తే బాధిస్తోంది. ఏకదాటిగా ఎడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. తీవ్ర శోకంలో మునిగిపోయిన షెహనాజ్‌ను చూసి ‘ఆమెకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆశిస్తున్నాము’, ‘ఇప్పుడు తన బాధ వర్ణించలేనిది’ అంటూ నెటిజన్లు, సిద్నాజ్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా? నిన్న ఆయన మరణవార్త విన్నప్పటి నుంచి ఆమె ఏకదాటిగా ఏడూస్తూనే ఉందని, ఆమె పరిస్థితి అసలు బాగాలేదని ఆమె తండ్రి మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్13లో పాల్గొన్న సిద్ధార్ద్ -షెహనాజ్ల లవ్ ట్రాక్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కపుల్‌కి సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తయిన తర్వాత కూడా వీళ్ల బంధం కొనసాగింది. వీరిద్దరూ కలిసి చివరగా డ్యాన్స్ దివానే-3 షోలో పాల్గొని సందడి చేశారు. సిద్ధార్థ్ ఆకస్మిక మరణంతో 'సిద్నాజ్' ఫర్ ఎవర్ అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తు వారిద్దరికి సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: Siddharth Shukla: షెహనాజ్‌తో ప్రేమాయణం..‘సిద్నాజ్’గా ఫేమస్ View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
నేడు మిలటరీ లాంఛనాలతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు
-
వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
-
శోకసంద్రమైన రెడ్డివారిపల్లె..
సాక్షి, చిత్తూరు(యాదమరి) : ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను ప్రవీణ్‌కుమార్ రెడ్డి భౌతికకాయం మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చేరింది. ఆదివారం జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరుడైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరజవాను భౌతికకా యం కోసం బంధువులు, గ్రామస్తులు, అధికారులు నిరీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి అనంతరం భౌతికకాయం స్వగ్రామానికి చేరడంతో నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న గ్రామం ఒక్కసారిగా దుఃఖ సాగరమైంది. ప్రవీణ్ మృతదేహాన్ని చూడగానే భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, బంధువులే కాకుండా ఇరుగుపొరుగు గ్రామాల వారు సైతం తీవ్రభావోద్వేగంతో కదలిపోయారు. మిలటరీ అధికారులు వారి ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చదవండి: (ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం) వాతావరణం సరిగా లేక.. ఉగ్రదాడిలో పాట్నాకు చెందిన కెప్టెన్ ఆశుతోష్, తెలంగాణకు చెందిన రెడ్యా మహేష్, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరులైన విషయం తెలిసిందే. వీరి భౌతికకాయాలను జమ్ముకాశ్మీర్ నుంచి ఢిల్లీలోని మిలటరీ కార్యాలయానికి తరలించారు. భౌతిక కాయాలపై కల్నల్ సుధీరా, లెఫ్టినెంట్ కల్నల్ అశ్విన్ పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి మిలిటరీ వాహనంలో రెడ్డివారిపల్లెకు తరలించారు. అప్పటికి సమయం అర్ధరాత్రికి పైగా దాటింది. మృతదేహంతో పాటు నాసిక్ యూనిట్ నుంచి 31 మంది ఆర్మీ సిబ్బంది ప్రత్యేక విమానంలో వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహం తరలింపులో ఆలస్యం చోటు చేసుకుందని, విమానం సాయంత్రం ఆరు గంటల తర్వాత బయలుదేరిందని మిలటరీ అధికారులు తెలిపారు. చదవండి: (ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు) నేడు దహనక్రియలు వీరజవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయానికి బుధవారం దహనక్రియలు జరుగనున్నాయి. మిలటరీ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించనున్నారు. బెంగళూరు నుంచి వచ్చే జెపీఎఫ్–9 మేజర్ నిర్బయ్ బండాకర్, మిలటరీ అధికారులు పకృద్ధీన్, హేమాద్రి గౌరవ వందనం అనంతరం దహనక్రియలు చేయనున్నట్లు మిలటరీ అధికారులు చెప్పారు. -
నేడు వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు
సాక్షి, నిజామాబాద్: ఇందూరు గడ్డపై జన్మించి.. దేశ సరిహద్దులో రక్షణ కవచమై నిలిచి ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ర్యాడ మహేష్ పార్ధీవ దేహం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చేరుకొంది. ఆశ.. శ్వాస ఆర్మీనే అంటూ అయినవాళ్లకు దూరంగా ఉంటూ దేశ ఊపిరే తన ప్రాణంగా పిడికిలి బిగించి ఎదిరించిన మహేష్ విగతజీవిగా రావడంతో పురిటిగడ్డ ఘొల్లుమంది. సతీమణి సుహాసిని, తల్లిదండ్రులు రాజులు, గంగమల్లు కన్నీటి సంద్రమయ్యారు. కోమన్‌పల్లి చిన్నబోయింది. కాగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీర జవాను ర్యాడ మహేశ్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన కోమన్‌పల్లిలో జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. దేశ రక్షణలో ప్రాణాలొదిలిన మహేశ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం మంగళవారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ రఘు ఆధ్వర్యంలో రెండు శాఖలకు చెందిన సిబ్బంది, స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంతిమయాత్ర, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్థానిక వైకుంఠధామాన్ని, అంతిమ యాత్ర సాగే రహదారులను పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల మోహరింపు బుధవారం జరిగే మహేశ్ అంతిమ యాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు భారీగా బలగాలను మోహరించారు. మంగళవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్‌పల్లికి చేరుకున్నారు. అంతిమయాత్రకు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ ధర్వపురి అర్వింద్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం. (ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) -
నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు