( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాప కుడు నందమూరి తారక రామారావు చిన్న (నాలుగో) కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బేకరీ వ్యాపారంలో ఉమామహేశ్వరి..
బేకరీ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఉమా మహే శ్వరి జూబ్లీహిల్స్ రోడ్ నం.9 లోని ప్లాట్ నం.73లో తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలిసి నివా సం ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ వ్యాపారి కావడంతో మూడురోజుల క్రితం పనుల నిమి త్తం బయట రాష్ట్రానికి వెళ్లారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమా ర్తె దీక్షిత నగరంలోనే భర్త రాహుల్ చౌదరితో కలిసి ఉంటున్నారు.
వంట చేయమని చెప్పి గదిలోకి వెళ్లి..
సోమవారం ఉదయం 10.30 గంటలకు బాచుపల్లిలో ఉండే దీక్షిత, ఆమె భర్త, ఉమా మహేశ్వరి ఆడపడుచు నిరుపమ ఆమె ఇంటికి వచ్చారు. వీరికి వంట చేయమని వంట మనిషికి చెప్పిన ఉమా మహేశ్వరి మధ్యాహ్నం 12 గంటలకు తన గదిలోకి వెళ్ళారు. 12.30కి పనిమనిషి బీబీ వెళ్లి డోర్ కొట్టినా ఎంతకూ తలుపులు తీయలేదు. గదిలోకి వెళ్ళిన తల్లి లోపలి నుంచి గడియ పెట్టుకోవడమే కాకుండా భోజనం సమయం అయినప్పటికీ బయటకు రాకపోవడంతో దీక్షితకు అనుమానం వచి్చంది. దీంతో ఆమె వెళ్ళి గది తలుపు కొట్టారు. ఎంతకూ తీయకపోవడంతో మిగిలిన వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్ళి చూశారు.
2.30కి పోలీసులకు సమాచారం
ఆ గదిలో ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. అప్పటికే మృతి చెందడంతో కిందకు దింపిన కుటుంబీకులు మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే ఈ విషయం పోస్టుమార్టం సహా ఇతర పరీక్షల్లో నిర్ధారణ కావాల్సి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఉస్మానియాలో పోస్టుమార్టం.. నేత్ర దానం
ఉమా మహేశ్వరి మరణంపై సమాచారం అందుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకే‹Ù, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ, సమీప బంధువులతో పాటు తీగల కృష్ణారెడ్డి, కంభంపాటి రామ్‌మోహ¯న్‌రావు ఆమె ఇంటికి చేరుకున్నారు. భార్య మృతి విషయం తెలియడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ తన ఇంటికి చేరుకున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు అభిజిత్, టకియుద్దీన్, రమణమూర్తి నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆ సమయంలో బాలకృష్ణ, రామకృష్ణ, లోకేశ్, శ్రీనివాస్ మార్చురీ వద్దే ఉన్నారు. ఉమా మహేశ్వరి నేత్రాలను కుటుంబీకులు దానం చేయడంతో వాటిని వైద్యులు సేకరించారు. రెండు మూడురోజుల వరకు మృతదేహం పాడవకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి జూబ్లీహిల్స్ నివాసానికి తరలించారు.
రేపు అంత్యక్రియలు..
ఉమా మహేశ్వరి ఇటీవలే తన చిన్న కుమార్తె దీక్షిత వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. కాగా ఈ నెల 3న ఉమా మహేశ్వరి మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన తల్లి చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దీక్షిత మీడియాకు వెల్లడించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment