పెద్దపంజాణి: భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలా ఉన్నాయి. మండంలోని చెదళ్లవాళ్లపల్లెకు చెందిన అమావాస్య అనే వ్యక్తి కుమారుడు గోపీ (30)కి అదే గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె తులసమ్మ (30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. గోపీ కంకర సరఫరా చేసే ఫ్యాక్టరీలో డ్రయివర్. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత తరచూ గొడవలు పడేవారు. కాగా తులసమ్మపై అనుమానంతో తరచూ గొడవలు పడేవారు. ఈ నేపథ్యలో కొన్నాళ్ల క్రితం తులసమ్మ పనుల కోసం బెంగళూరుకు వెళ్లి, అక్కడే ఉండేది. ఈ సమయంలో గోపి మదనపల్లెకు చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న తులసమ్మ రెండు నెలల క్రితం గ్రామానికి చేరుకుని, ఇకపై ఇద్దరం కలిసి ఉందామని నచ్చచెప్పి గోపి రెండో భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత కూడా తులసమ్మ కోసం ఓ వ్యక్తి చెదళ్లవారిపల్లెకు వచ్చి వెళ్లేవాడు. దీంతో గోపి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డారు. తీవ్ర ఆవేశానికి లోనైన తులసమ్మ భర్త గోపిని మచ్చు కత్తితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవరం సీఐ రవికుమార్, స్థానిక ఎస్‌ఐ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలు పరారీలో ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
భార్య చేతిలో భర్త హతం
Published Fri, Dec 25 2015 2:10 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement