
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటుకు గండం వచ్చింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో తన కొడుకు, ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండడంతో ఆయన కంగుతిన్నారు. మరోవైపు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు గంటాను మరింత కలవరపాటుకు గురిచేశాయి. అయితే లోకేష్ లేదంటే జేడీ కోసం భీమిలీ స్థానాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో గంటా అలకబూనినట్టు తెలిసింది.
(అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు)
ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని బాబు చేసిన సూచనను గంటా ఆమోదించడం లేదు. అధిష్టానం బుజ్జగింపుల పర్వానికి దూరంగా ఉండాలనే నేపథ్యంలో గంటా నిన్నటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. నిన్న సాయంత్రం అమరావతికి వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ వెళ్లినట్టుగా సమాచారం. అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment