bheemili constituency
-
భీమిలి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా అవంతి శ్రీనివాస్ నామినేషన్
-
ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదన్న మంత్రి
-
అందుబాటులో లేకుండా పోయిన ఏపీ మంత్రి..!
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటుకు గండం వచ్చింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో తన కొడుకు, ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండడంతో ఆయన కంగుతిన్నారు. మరోవైపు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు గంటాను మరింత కలవరపాటుకు గురిచేశాయి. అయితే లోకేష్ లేదంటే జేడీ కోసం భీమిలీ స్థానాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో గంటా అలకబూనినట్టు తెలిసింది. (అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు) ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని బాబు చేసిన సూచనను గంటా ఆమోదించడం లేదు. అధిష్టానం బుజ్జగింపుల పర్వానికి దూరంగా ఉండాలనే నేపథ్యంలో గంటా నిన్నటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. నిన్న సాయంత్రం అమరావతికి వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ వెళ్లినట్టుగా సమాచారం. అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్టు తెలిసింది. (గంటాకు ఎసరు?) -
భీమిలి బాద్షా ఎవరు?
1952లో నియోజకవర్గ ఆవిర్భావం నుంచి గెలిచిన పార్టీలు : 1952లో స్వతంత్ర అభ్యర్థి, 1957లో ప్రజా సోషలిస్టు పార్టీ, 1962, 1967, 1972, 1978లో వరుసగా కాంగ్రెస్, 1983 నుంచి 1999 వరకు తెలుగుదేశం పార్టీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ గెలిచాయి. భీమిలి.. దేశంలోనే అతి పురాతనమైన రెండో మున్సిపాలిటీ. సాగర తీరంతో, ప్రకృతి సౌందర్యాలతో అలరారే అందమైన లోగిలి. అయితే.. ఇదంతా ఐదేళ్లకు ముందు మాట. ఇప్పుడు రాష్ట్రంలోనే రూ.వేల కోట్ల భూకుంభకోణాలకు, అక్రమాలకు లోగిలిగా మారిపోయింది. టీడీపీ నేతల అరాచకాలకు, దందాలకు నెలవైంది. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా వేటినీ వదలకుండా భీమిలిని చెరపట్టేశారు. అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత సులువుగా భూరికార్డులు మారిపోయాయి. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే.. అక్కడ తహశీల్దార్ కార్యాలయ రికార్డుల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తమైపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి ఇది నాది అని దబాయించే దారుణ పరిస్థితులు ఐదేళ్లుగా ఇక్కడ రాజ్యమేలాయి. అందుకే ఇప్పుడు భీమిలి పేరు చెబితే టీడీపీ నేతలు సృష్టించిన భూదందాల విలయమే గుర్తుకు వస్తుంది. అలాంటి భీమిలిలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో ఓటరు ఎటువైపు మొగ్గుచూపనున్నాడో ఓసారి పరిశీలిద్దాం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం (విశాఖపట్నం లోక్‌సభ పరిధి) పరిధిలోని మండలాలు: భీమిలి అర్బన్ (జీవీఎంసీ), రూరల్ మండలం, ఆనందపురం మండలం, పద్మనాభం మండలం, విశాఖ రూరల్ మండలం (జీవీఎంసీ మధురవాడ జోన్ 4, 5 వార్డులు పూర్తిగా 6, 72 వార్డులు పాక్షికంగా). జనాభా సుమారు 4 లక్షలు. 2017 ఓటర్ల జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,520. ఇందులో అత్యధికంగా కాపులు 48,290 మంది, యాదవులు 47,500, మత్స్యకారులు 17,300 మంది, ఎస్సీలు 16,900 మంది, రెడ్లు 19,300 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి అవంతి 2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచిన ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు ఆ తర్వాత పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్‌లోకి, అటు నుంచి టీడీపీలోకి వెళ్లి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు భీమిలి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన అవంతికి వివాదరహితుడిగా పేరుంది. భీమిలి నియోజకవర్గాన్ని పట్టి పీడించిన గంటా గ్యాంగ్ అరాచకాలు, అక్రమాలు, పాలకులపై విసిగివేసారిపోయిన స్థానిక ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ గత సెప్టెంబర్‌లో జరిగిన పాదయాత్రలో కనీవినీ ఎరుగని విధంగా పోటెత్తారు. వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకే తాను భీమిలి వచ్చానంటూ అవంతి ప్రజలతో మమేకమై పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ బలానికి తోడు అవంతి రాకతో నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందనే చెప్పాలి. టీడీపీ.. గంటా శ్రీనివాసరావు లేదా నారా లోకేష్ భీమిలి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఐదేళ్లలో సీఎం చంద్రబాబు, లోకేష్‌లకు ధీటుగా అప్రతిష్టను మూటకట్టుకున్నారు. విశాఖ జిల్లాకే చెందిన మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా మంత్రి గంటా భూదందాలు, అక్రమాలపై బహిరంగంగా ఆరోపణలు చేసి పెను సంచలనం సృష్టించారు. ఈ ఐదేళ్లలో భీమిలిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకపోగా, భూదందాలతోపాటు బంధువులు, అనుచరుల అరాచకాలు, ఇద్దరు తహశీల్దార్ల సస్పెన్షన్‌తో గంటా ఇమేజ్ మసకబారిపోయింది. దీంతో గంటాను భీమిలి నుంచి తప్పించాలని కొన్నాళ్లుగా చంద్రబాబు భావిస్తూ వస్తున్నారు. ఆర్నెల్ల కిందట ఇదే ప్రతిపాదన తీసుకురాగా గంటా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో అప్పటికి తాత్కాలికంగా ఊరుకున్నారు. అయితే ఇప్పుడు భీమిలి నుంచి నారా లోకేష్‌ను బరిలోకి దించాలన్న ప్రతిపాదనను పెట్టి గంటాకు వేరే చోటు వెతుక్కునే పనిపెట్టారు. నారా లోకేష్ గెలవగలరా? భీమిలిలో 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2009లో ప్రజారాజ్యం విజయం సాధించగా, 2014లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఈసారి నారా లోకేష్ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతోపాటు భీమిలిలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ ఓటమి తప్పదని అంటున్నారు. ఇక సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో కూడా లోకేశ్‌కు భీమిలి సరైన స్థానం కాదనే వాదన స్వయంగా టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. గంటాను తప్పించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బంధువు, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్‌ను రంగంలోకి దించాలన్న యోచన కూడా బాబు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఎమ్మెల్యేగా హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన కుంభకోణాలతో ప్రజల్లో బాగా పలుచనైన కర్రి అభ్యర్థి అయినా టీడీపీది కోలుకోలేని పరిస్థితే. ప్రధాన సమస్యలు - చిట్టివలస జ్యూట్‌మిల్లు లాకౌట్ సమస్య: 2009, ఏప్రిల్ నుంచి లాకౌట్‌లో ఉన్నప్పటికీ నేటికీ పరిష్కారం కాలేదు. ఇప్పటికీ కార్మికులకు రావలసిన పీఎఫ్, గ్రాట్యుటీ తదితర రూ.150 కోట్లు బకాయిలను యాజమాన్యం ఇవ్వలేదు. - తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం: 30 ఏళ్లుగా ఇక్కడ నిర్మిస్తామన్న ఆర్టీసీ కాంప్లెక్స్ సాకారం కాలేదు. 2016, జూన్‌లో మంత్రి గంటా భూమిపూజ చేశారు. కానీ ఫలితం శూన్యం. - తగరపువలసలో రైతు బజారు: 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు రైతుబజారు నిర్మిస్తామని హామీనిచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు విరివిగా సాగవుతున్నా రైతుబజారు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - ఆనందపురం, తగరపువలసలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవు. - ఆనందపురం మండలంలో జగ్గమ్మగెడ్డ రిజర్వాయర్ సమస్య అలాగే ఉంది. ఇది పూర్తయితే గానీ మండలంలోని తాగు, సాగునీటి అవసరాలు తీరవు. - పద్మనాభం మండలంలో అల్లూరి జన్మించిన పాండ్రంగి గ్రామ పంచాయితీ గోస్తనీ నదికి వరదలు వస్తే మునిగిపోతుంది. ఇక్కడ నదిపై వంతెన నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. - జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తగరపువలసలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ సమస్య అలాగే ఉంది. - భీమిలిని శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ కలగానే మిగిలిపోయింది. -
గంటాకు ఎసరు?
సాక్షి, అమరావతి : మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు తనదైన శైలిలో ఎసరు పెట్టారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో తన కొడుకు, ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు పావులు కదుపుతుండడంతో ఆయన కంగుతిన్నారు. ఉండవల్లిలో శుక్రవారం జరిగిన విశాఖ పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో భీమిలి సీటును చంద్రబాబు ఆయనకు ఖరారు చేయలేదు. ఈ స్థానంలో లోకేష్ పోటీ చేస్తారని ఆయన కోసం త్యాగం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కుదిరితే విశాఖపట్నం ఎంపీ లేదా విశాఖ నార్త్, చోడవరం, గాజువాక అసెంబ్లీలో ఒక దాన్ని కేటాయించే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. దీంతో అవాక్కయిన గంటా జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురికి సీటు ఖరారు చేసి తన సీటును పెండింగ్‌లో పెట్టడంపై అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీటు కేటాయించే విషయంపై చర్చల కోసం శనివారం ఉదయం మళ్లీ రావాలని చంద్రబాబు సూచించినా.. గంటా వెళ్లలేదు. తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి పార్టీ ముఖ్యులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు లోకేష్ భీమిలిలో పోటీచేస్తే ఆయన తోడల్లుడు భరత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని చాలా రోజుల నుంచి టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ పేరు తెరపైకి రావడంతో భరత్ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. -
గంటాను భీమిలి నుంచి తప్పించేందుకు స్కెచ్
-
భీమిలి నియోజకవర్గంలో ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
అమాత్యుని జాడేదీ!
నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే... అంతేకాదు ఆయన రాష్ట్ర మంత్రి కూడా. అయినా ఏం ప్రయోజనం!?... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది భీమిలి నియోజకవర్గ ప్రజల పరిస్థితి. హుద్‌హుద్ పెను తుపాను నియోజకవర్గంపై విరుచుకుపడి నేటికి సరిగ్గా నెలరోజులు. కాని మంత్రిగారేమో ఇప్పటి వరకూ బాధితుల చెంతకే వెళ్ల లేదు. నమ్మలేకుండా ఉన్నారా!... అయితే చదవండి... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్టోబరు 12న హుద్‌హుద్ తుపాను సాగరతీరంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, తగరపువలస మండలాలతోపాటు జీవీఎంసీ పరిధిలోని మధురవాడలో జనజీవనం అతలాకుతలమైంది. భీమిలిలోని తోటవీధి, మంగమారితోట తదితర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు ముంచెత్తింది. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బోట్లు కొట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు లేవు. వండుకునేందుకు పాత్రలు లేవు. తినేందుకు తిండిలేదు. దాదాపు 15 రోజులపాటు విద్యుత్తు సరఫరా లేక ప్రజలు అంధకారంలో అల్లల్లాడిపోయారు. పెనుతుపాను ఇంతటి విధ్యంసాన్ని సృష్టిస్తే ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు నుంచి బాధితులు ఎంతో సహాయం ఆశించారు. ఆయన బాధ్యతాయుతంగా వెంటనే రంగంలోకి దిగుతారని భావించారు. కాని వాస్తవానికి గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకూ ఒక్కసారిగా కూడా నియోజకవర్గంలోని బాధిత ప్రాంతాల్లో పర్యటించనే లేదు. బాధితులను పరామర్శించ లేదు. కూలిన ఇళ్లు చూడలేదు. మత్స్యకారులు, కూలీలు, పేదల అవస్థలు పట్టించుకోలేదు. కేవలం మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టారు. ఇతర ప్రాంతాలకు చెందిన సహచర మంత్రులు, ఒకట్రెండు సంఘాలు వచ్చినప్పుడు ముక్తసరిగా పది నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. తుపాను నుంచి నేటివరకు... అక్టోబరు 12న హుద్‌హుద్ తుపాను విశాఖపట్నం సమీపంలో తీరందాటి పెను విధ్వంసం సృష్టించింది. అప్పటి నుంచి గంటా భీమిలి నియోజకవర్గంలో పర్యటిన వివరాలిలా ఉన్నాయి... అక్టోబరు 17: హుద్‌హుద్ తుపాను అక్టోబరు 12న విధ్వంసం సృష్టిస్తే మంత్రి గంటా అక్టోబరు 17న భీమిలి వచ్చారు. అక్టోబరు 12 తరువాత అనారోగ్య కారణంతో ఆయన మూడురోజులు విశ్రాంతి తీసుకున్నారు. అక్టోబరు 17నే ఆయన భీమిలిలోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా విశాఖపట్నం బయలుదేరారు. దాంతో స్థానికులు కొందరు ఆయన్ను బాధిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాను రాలేనని మంత్రి గంటా చెప్పారు. కాని ఒక్కసారి వచ్చి కూలిన ఇళ్లు, రోడ్డునపడ్డ బతులకు చూడాలని వారు ప్రాథేయపడ్డారు. వారి ఒత్తిడి మీదే మంత్రి గంటా భీమిలిలోని తోటవీధి ప్రాంతానికి వచ్చారు. ఆప్రాంతం మొదట్లోనే కారు దిగి చూశారు. లోపలికి వచ్చి కూలిన ఇళ్లను చూడాలని బాధితులు కోరారు. కాని మంత్రి కేవలం పది అడుగులు వేసి అక్కడ నిలబడి రెండు నిమిషాలు పరికించి చూసి వెళ్లిపోయారు. అంతేగాని తీవ్రంగా దెబ్బతిన్న తోటవీధి ప్రాంతంలో ఆయన తిరగలేదు. ప్రజలను పలకరించనే లేదు. కూలిన ఇళ్లనుగాని ఇతర నష్టాన్నిగాని పరిశీలించకుండానే వెనుదిరిగారు. అక్టోబరు 18: ఎంపీ హరిబాబు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావులను తీసుకువచ్చి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి గంటా ఆ సమావేశానికి హాజరై 15 నిమిషాలు పాల్గొని వెళ్లిపోయారు. బాధితుల చెంతకు మాత్రం వెళ్ల లేదు. అక్టోబరు 19: గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రోమన్ కేథలిక్ చర్చి ప్రతినిధులు భీమిలిలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ కళాశాలలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆయనతోపాటు మంత్రి గంటా కూడా బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయారు. తుపాను బాధిత ప్రాంతాలకు వెళ్లలేదు. అక్టోబరు 20: నారా లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ భీమిలిలోని మంత్రి గంటా క్యాంప్ కార్యాలయంలో బాధితులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. దీనికి మంత్రి గంటా హాజరై ఫొటోగ్రాఫర్లు ఫొటో తీయగానే వెళ్లిపోయారు. అక్టోబరు 21: తుపాను రోజు దుర్మరణం పాలైన యర్రంశెట్టి కొండమ్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారంగా రూ. 5లక్షల చెక్‌ను అందించేందుకు కృష్ణా కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయారు.