ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల | Andhra Pradesh DSC-2018 notification Released | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

Published Wed, Dec 6 2017 3:20 PM | Last Updated on Fri, May 25 2018 7:06 PM

Andhra Pradesh DSC-2018 notification Released - Sakshi

మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు(ఫైల్‌ ఫొటో)

సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటన చేశారు. ఈ నెల 15న డీఎస్సీ నోటిఫికేషన్‌ తో పాటు సిలబస్‌ ను విడుదల చేస్తామని, మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన బుధవారమిక్కడ తెలిపారు.

45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని మంత్రి గంటా వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్‌ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

నోటిఫికేషన్‌ వివరాలు :
 

  • 15-12-2017 న  డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల
  • 26-12-2017 నుండి 8-02-2018 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 09.03.2018 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు
  • 05.05.2018 న ఫలితాల విడుదల
  • 2018 జూన్ 12 నాటికి పోస్టింగ్‌లు

సమస్యలపై ఇలా..
1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కరించడానికి ఎమ్యెల్సీ, అధికారులతో కమిటీ నియమిస్తున్నట్లు గంటా తెలిపారు. నివేదిక రాగానే అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. రూ. 5 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement