
గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి గంటా
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): శ్రీకాకుళం పర్యటన ముగించుకుని స్వల్ప విరామం కోసం రామ్‌నగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కొంత సేపు మాట్లాడారు. తొలిత కలెక్టర్ ప్రవీణ్ కుమార్, వుడా వీసీ బసంత్ కుమార్, జేసీ సృజన పుష్పగుచ్చాలతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ హైదరాబాదు బయలుదేరి వెళ్ళారు.