
నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులు
నల్లగొండ రూరల్ : టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ రో డ్డులోని పాల్‌టెక్నిక్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. ప్రస్తుతం ఖాళీగా లిగా ఉన్న 2లక్షల 60 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులపై పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఈనెల 24, 26 తేదీల్లో నిర్వహించే టీఆర్టీ íపరీక్షలను సిలబస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చుక్క సైదులు, నర్సింహ, పరుశురాం, హరీష్, నాగరాజు, శ్రీలత, నాగలక్ష్మి, సంధ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment