ఏపీ టెట్‌ పరీక్షలు వాయిదా | Ap tet were postponed to February 5 | Sakshi
Sakshi News home page

ఏపీ టెట్‌ పరీక్షలు వాయిదా

Published Thu, Dec 28 2017 8:03 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)– 2017ను ప్రభుత్వం మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. టెట్‌కు సిద్ధమవ్వడానికి తగినంత వ్యవధి లేదని, సిలబస్‌ కూడా ఎక్కువ ఉందని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గడువు పొడిగించినట్టు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. టెట్‌ ఫలితాలను ఫిబ్రవరి 26న విడుదల చేస్తామన్నారు. టెట్‌ షెడ్యూల్‌ను ఈ నెల 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ను వాయిదా వేసినప్పటికీ డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి గంటా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement