సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, టెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా వాయిదా వేయడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఓవర్సీస్ ఫ్రెండ్‌స ఆఫ్ బీజేపీ అమెరికా శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణారెడ్డి అభినందన కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎంసెట్, టెట్ పరీక్షలను వాయిదా వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.
విద్యా విధానంలో లోటుపాట్లుంటే సవరించాల్సిందేనని, అయితే అది సామరస్యంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రిటైర్డు డీజీపీ వి. దినేశ్ రెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి , జి.మధుసూదన్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, కె.రాములు,పద్మజా రెడ్డి, హనీఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తును అంధకారం చేయడమే: లక్ష్మణ్
Published Sat, Apr 30 2016 7:23 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement
Advertisement