TS TET 2024: ఏప్రిల్‌లో టెట్‌! | Preparations of Education Department for conducting Tet | Sakshi
Sakshi News home page

TS TET 2024: ఏప్రిల్‌లో టెట్‌!

Published Wed, Jan 3 2024 4:41 AM | Last Updated on Wed, Jan 3 2024 4:51 PM

Preparations of Education Department for conducting Tet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:     ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్‌ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వ హించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు.

2012కు ముందు టెట్‌ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్‌ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం  తెలిపింది. అయితే టెట్‌ పరీక్ష నిర్వహించే వరకూ ఈ నిబంధనను అమలు చేయలేమని పే ర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మిన హాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్‌ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. 

మెగా డీఎస్సీకీ టెట్‌ ఆటంకం
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డీఎస్సీ చేపట్టాలంటే, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి 22 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్‌ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

టెట్‌ ఎవరికి?
రాష్ట్రంలో సర్వీస్‌లో ఉన్న వారికి డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ మాదిరి ప్రత్యేకంగా టెట్‌ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్‌ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్‌ తప్పనిసరి. కాగా ఏడాదికి రెండు సార్లు టెట్‌ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా, ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవారికి విధిగా టెట్‌ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, అందరికీ కలిపి సాధారణ టెట్‌ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది.

టెన్త్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌ మొదటి వారంలో టెట్‌ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్‌కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్‌పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది. 

ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది
టెట్‌ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాసయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. వారికి ప్రత్యేక సిలబస్‌తో పరీక్ష పెట్టాలి.  – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement