
టెట్ ఫలితాలు విడుదల
టెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను విడుదల చేశారు.
హైదరాబాద్: టెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను విడుదల చేశారు. పేపర్-1లో 54.45 శాతం, పేపర్-2లో 24.05 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత నెల 22న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,75,552 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,082 మంది (90.55 శాతం) హాజరయ్యారు.
ఇందులో పేపరు-1 రాసేందుకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా, 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 రాసేందుకు 2,74,339 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,924 మంది (91.83 శాతం) హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను www.sakshieducation.com, tstet. cgg.gov.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.
ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి