(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు టెట్ కన్వీనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు టెట్ కన్వీనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అలాగే బీఈ/బీటెక్ చదివి బీఈడీ 2015–17 బ్యాచ్‌కు చెందిన.. ప్రస్తుతం రెండో ఏడాది నాలుగో సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు టెట్ పేపర్–2 పరీక్షకు అర్హులుగా పేర్కొన్నారు. వీరు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.