
బిడ్డకు జన్మనిచ్చి వెంటనే టెట్ రాసిన మహిళ
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టెట్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ మహిళకు ఉన్నట్టుండి పురుటినొప్పులు రావడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పండంటి శిశువును ప్రసవించిన తర్వాత ఆమె తిరిగి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది.
మల్దకల్ మండలానికి చెందిన కవిత తొమ్మిది నెలల గర్భవతి. ఆదివారం జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్లో టెట్ రాసేందుకు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పురుటి నొప్పులు రావడంతో 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే శిశువుకు జన్మనిచ్చింది. విశ్రాంతి తీసుకోకుండా పట్టుబట్టి వెంటనే పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్షలో పాల్గొంది.