టెట్‌ పరీక్షకు భారీగా దరఖాస్తులు | huge response to TET in telangana | Sakshi
Sakshi News home page

టెట్‌ పరీక్షకు భారీగా దరఖాస్తులు

Published Thu, Mar 24 2016 7:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

huge response to TET in telangana

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 15 నుంచి ఫీజు చెల్లింపు, 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

పది రోజుల్లోనే 1,28,464 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఈ వారం రోజుల్లో మరో 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక 2013లో నోటిఫికేషన్ జారీ చేసిన టెట్‌కు రాష్ట్రంలో 2,50,103 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement