ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సిలబస్‌లో విద్యా శాఖ స్వల్ప మార్పులు చేసింది.
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సిలబస్‌లో విద్యా శాఖ స్వల్ప మార్పులు చేసింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అంశాన్ని టెట్ సిలబస్‌లో చేర్చింది. బోధన పద్ధతులు అంశంలో దీన్ని చేర్చింది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ అంశాలను ఇందులో పేర్కొంది. టెట్‌లో వీటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.