TET, Teachers Eligibility Test Certificate To Be Valid For Lifetime - Sakshi
Sakshi News home page

Teachers Eligibility Test: టెట్​ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు..

Published Thu, Jun 3 2021 3:45 PM | Last Updated on Thu, Jun 3 2021 4:34 PM

Teacher Eligibility Test  Pass Certificate Valid For Lifetime: Government - Sakshi

న్యూఢిల్లీ: టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్​) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్​ క్వాలిఫైయింగ్​ సర్టిఫికెట్​ గడువును 7  సంవత్సరాల నుంచి జీవిత కాలం  పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్​ పోఖ్రియల్​ నిశాంక్​ కీలక ఆదేశాలను జారీచేశారు. 

నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ టీచర్​ ఎడ్యుకేషన్​ (ఎన్​సీటీఈ) ప్రకారం  2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్​ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్​కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్​ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే. 

చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్‌వెల్‌ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement