Central Education Minister High Level Meeting On Entrance Exams - Sakshi
Sakshi News home page

ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం

Published Sat, May 22 2021 3:18 PM | Last Updated on Sat, May 22 2021 5:42 PM

Central Education Minister High Level Meeting On Entrance Exams - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివిధ కోర్సుల పరీక్షల నిర్వహణపై కేంద్రం రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్‌ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల కార్యదర్శులు, బోర్డు ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్షల నిర్వహణపై వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు లేఖలు రాసింది.

కాగా, కరోనా నేపథ్యంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ప్రొఫెషనల్‌ కోర్సుల ఎంట్రన్స్‌ పరీక్షలను వాయిదా వేసింది. కేంద్రమంత్రి రమేష్‌ పోక్రియాల్ ఈ పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement