
ఒంగోలు సెంట్రల్: గత ఏడేళ్లలో టెట్‌లో అర్హత సాధించి 2018 డీఎస్సీ పరీక్ష రాయబోయే గిరిజన యువతీ, యువతకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌చార్జి అధికారి బి.శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, వెంకటాచలం మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో 2 నెలల పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26న నెల్లూరు ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రంతో అభ్యర్థులు రావాలని సూచించారు. ఇతర వివరాలకు 81878 99877 సెల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.