ఈ ఏడాది టెట్ యథాతథం: గంటా
విశాఖపట్నం : ఈ ఏడాది టెట్ను యథతథంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్రావు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... వచ్చే ఏడాది నుంచి టెట్ కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
టీచర్ల బదిలీలలో రేషనలైజేషన్ విధానాన్ని చేపడతామన్నారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ అయ్యే వరకు విద్యా వాలంటీర్ల సర్వీసును కొసాగిస్తామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.