డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Published Sat, Nov 12 2016 10:02 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
- హాల్ టిక్కెట్ మిస్ అయిందనే కారణం
ఆదోని టౌన్: హాల్ టిక్కెట్ మిస్ కావడంతో మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శనివారం కౌతాళం మండలం మల్లన్నహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహదేవ ఆదోని పట్టణంలో డిగ్రీ సెకండ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఆదోనిలోని ఏఏఎస్ కళాశాలలో మూడు రోజుల క్రితం పరీక్ష రాశాడు. శనివారం మరో పరీక్ష రాయడానికి ఆదోనికి వచ్చాడు. కళాశాల వద్దకు చేరుకొని హాల్‌టిక్కెట్‌ను చూడగా మిస్ అయినట్లు భావించాడు. పరీక్ష రాయించరని, అమ్మానాన్నలకు సమాధానం ఎలా చెప్పాలని మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి చేరుకొని ఇంటివద్దనే పురుగుల మందు తాగాడు. పరిస్థితిని గమనించిన తల్లి రాగమ్మ, ఇరుగు పొరుగు మహిళలు మహదేవను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహదేవ వాంగ్మూలాన్ని సేకరించిన ఔట్‌పోస్టు కానిస్టేబుల్ బీరప్ప..సమాచారాన్ని కౌతాళం పోలీసులకు అందజేశారు.
Advertisement
Advertisement